Begin typing your search above and press return to search.

రాధికా ఆఫ్టే.. మరోసారి బికినీ షాక్

By:  Tupaki Desk   |   15 Jun 2022 10:30 AM GMT
రాధికా ఆఫ్టే.. మరోసారి బికినీ షాక్
X
రాధిక ఆప్టే.. సినిమా ప్రపంచంలో అలాగే సోషల్ మీడియాలో కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి పాత్ర అయినా సరే తన దైన శైలిలో వెండితెరపై డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే అతి కొద్దిమంది టాలెంటెడ్ నటులలో రాధికా ఒకరు. మోడల్ గా మంచి గుర్తింపుని అందుకుని అతి తక్కువ కాలంలోనే సినిమా ప్రపంచంలోనే అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ పాత్ర డిమాండ్ చేస్తే ఎంతవరకైనా వెళ్తుంది అని చాలా సార్లు నిరూపించింది.

నటిగా ఆమె చాలాసార్లు ప్రేక్షకుల నుంచి వందకు వంద మార్కులు వేయించుకుంది. కానీ కొన్ని సార్లు గ్లామర్ డోస్ ఎక్కువగా కావడంతో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నటన విషయంలో రాధిక మాత్రం ఎప్పుడూ కూడా ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె ఫోటోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.

రీసెంట్ గా ఒక బీచ్ లో సరదాగా దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారుతొంది. గతంలో కూడా రాధికా చాలాసార్లు బికినీ అందాలతో కనిపించింది. కానీ ఈసారి మాత్రం మరింత కొత్తగా కనిపించింది అని నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు. థైస్ అందాలతో ఒక విధంగా మతిపోగొట్టేసిందని అంటున్నారు.

ఇక చాలా వరకు రాధికా ఇండస్ట్రీ లో జరిగే ప్రైవేట్ పార్టీలకు దూరంగానే ఉంటుంది. వీలైనంత వరకూ తన సన్నిహితులతో స్నేహితులతో కలిసి ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాలకు వెళ్లి అక్కడే హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ పార్టీలకు విరుద్ధమని కూడా చాలాసార్లు చెప్పింది.

ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంటే కంటెంట్ గురించి తప్పితే పర్సనల్ విషయాల గురించి మాట్లాడనని కూడా రాధికా తెలియజేసింది. ఇక గతంలో రాధికా హీరోయిన్ సర్జరీ గురించి ఆశ్చర్యం కలిగించే కొన్ని వ్యాఖ్యలు చేసింది.

కొంతమంది ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలని శరీరాకృతిని మార్చుకునేందుకు ఎన్నో రకాల సర్జరీలు చేయించుకుంటున్నారు. అలాంటివి తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో కూడా చాలామంది సర్జరీలు చేయించుకున్న వారే అని ఆమె కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యల కారణంగా మరికొందరు స్టార్స్ ఆమెకు కౌంటర్ కూడా వేశారు. ఇక ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా రాధికా ఆప్టే సినిమాలతో బిజీగా మారిపోయింది.