Begin typing your search above and press return to search.
లెజండ్ బ్యూటీకి 30 వయసొచ్చిందోచ్
By: Tupaki Desk | 7 Sept 2015 5:24 PM ISTనటసింహా బాలయ్య సరసన ఇప్పటికే రెండు సినిమాల్లో నటించేసింది రాధికా ఆప్టే. లెజెండ్, లయన్ సినిమాల్లో రాధిక నటనకు చక్కని పేరొచ్చింది. అయితే ఈ అమ్మడు అంతకంటే ముందు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రక్తచరిత్ర సినిమాతో తెలుగులో ప్రవేశించింది. అప్పట్నుంచి కెరీర్ కాస్త తడబడినా వరుసగా సినిమాల్లో మాత్రం నటిస్తూనే ఉంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం పట్టేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
వాస్తవానికి రాధిక సినీనాయికగా కెరీర్ ప్రారంభించింది బాలీవుడ్ లో. అక్కడ ..వా లైఫ్ హోతో హైసీ చిత్రంతో హిందీ కెరీర్ ప్రారంభించింది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం , బెంగాళీ .. ఇన్ని పరిశ్రమల్లో నటించేస్తోంది ఇప్పుడు. బెంగాళీ చిత్రం అంతహీన్ లో నటిస్తోంది ఇప్పుడు. ఇటీవలి కాలంలో వివాదాలతో ప్రచారం సంపాదించుకుంటోంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఓ న్యూడ్ లఘుచిత్రంలో నటించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అహల్య అనే లఘుచిత్రంలో హాట్ అప్పియరెన్స్ తో యువతరం మొబైల్ యాప్ లలో సుస్థిరం అయిపోయింది. ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టాటస్ ని అందుకోవాలని కలలు గంటోంది. (ఈరోజుతో ఈ అమ్మడు 30వ వసంతంలోకి అడుగుపెడుతోంది)