Begin typing your search above and press return to search.
#రాధేశ్యామ్ ఊపిరాడనివ్వని ట్రీటిస్తారట
By: Tupaki Desk | 4 April 2021 2:00 PM ISTరాధేశ్యామ్ టీమ్ నుంచి సరైన ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ కాకపోవడంపై ప్రభాస్ అభిమానులు గుర్రుమీదున్న సంగతి తెలిసినదే. జూలై 30న ఈ చిత్రం రిలీజవుతోంది. కానీ ఇప్పటివరకూ సరైన విజువల్ గ్లింప్స్ ఏదీ రాలేదన్న అసంతృప్తి అభిమానుల్లో ఉంది.
అయితే ఈ అసంతృప్తిని తగ్గించేందుకు మేకర్స్ సరైన ప్రణాళికతో సిద్ధమవుతున్నారన్నది తాజా అప్ డేట్. రాధే శ్యామ్ బహు భాషాల్లో విడుదలవుతుంది కాబట్టి ఇకపై బ్యాక్ టు బ్యాక్ టీజర్లు పాటలతో ప్రచారంలో స్పీడ్ పెంచేస్తారట. ట్రైలర్ కూడా నెల ముందు రిలీజవుతుంది.
ఏప్రిల్ లో రెండు టీజర్లు సహా పాటలు ఒకటొకటిగా రిలీజ్ చేసేస్తారు. రెండు ఆసక్తికర టీజర్లు .. ట్రైలర్ రెడీ చేస్తున్నారని సమాచారం. పాట తరవాత పాట ఏప్రిల్ మాసం అంతా అభిమానులకు ట్రీట్ ఉంటుందట. ఐదు పాటలు వరుసగా రిలీజవుతాయని తెలిసింది. తెలుగు-తమిళం- హిందీ భాషలలో ఏకకాలంలో ఇవన్నీ రిలీజవుతాయి. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ -గోపికృష్ణ మూవీస్- టీ సిరీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటించింది.