Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ టాప్ సీక్రెట్ లీక్ అయిందిగా..

By:  Tupaki Desk   |   23 July 2021 8:30 AM GMT
రాధేశ్యామ్ టాప్ సీక్రెట్ లీక్ అయిందిగా..
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా.. పూజా హెగ్దే నాయిక‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు- హిందీ భాష‌ల్లో  ఈ చిత్రాన్ని అత్యంత‌ భారీ బ‌డ్జెట్  తో యువీ క్రియేష‌న్స్ సంస్థ‌ నిర్మిస్తోంది. ఇదో పీరియాడిక‌ల్ ప్రేమ క‌థా చిత్రంగా తెర‌కెక్కుతోంది. అలాగే నాటి కాలమానం ప్ర‌కారం సెట్లలో యాక్ష‌న్ స‌న్నివేశాలు అంతే ఆస‌క్తిక‌రంగాను సాగ‌నున్నాయి. అందుకోసం ప్ర‌త్యేకంగా సెట్లు నిర్మించి చిత్రీక‌రించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ విజువ‌ల్స్ తో  సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక షూటింగ్ కూడా చాలా వ‌రకూ పూర్త‌యింది.

క‌రోనా తొలి .. రెండ‌వ‌ వేవ్ స‌మ‌యంలో  సైతం రాధేశ్యామ్ యూనిట్ షూటింగ్ కి పెద్ద‌గా బ్రేక్ వేయ‌లేదు. నిబంధ‌న‌లు ఉన్నా క‌రోనా అంత‌గా అధికంగా లేని దేశంలోకి వెళ్లి మ‌రీ షూటింగ్ చేసారు. సెకెండ్ వేవ్ స‌మ‌యంలో కొంచెం విశ్రాంతి తీసుకున్న‌ప్ప‌టికీ పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులకు స‌మ‌యం కేటాయించి వీలైనంత వ‌ర‌కూ ఆ ప‌నులు పూర్తి చేసారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్ డేట్ ని పూజాహెగ్దే అందించింది. షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌ని ఇంకా కేవ‌లం 10 రోజులు షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని  తెలిపింది. ఇదొక మంచి ల‌వ్ స్టోరీ..ఇలాంటి పాత్ర‌లో న‌టించి చాలా కాల‌మైంద‌ని...కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ఇచ్చింద‌ని  పేర్కొంది. అయితే  త‌న పాత్ర రొమాంటిక్ గా ఉంటుంద‌ని..ఇత‌ర విష‌యాలు  మాత్రం ఇప్పుడే చెప్ప‌లేన‌ని చెప్పుకొచ్చింది.

ఇక పూజాహెగ్దే మిగ‌తా సినిమాల విష‌యానికి వ‌స్తే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `ఆచార్య`లో  నీలాంబ‌రి పాత్ర‌లో  న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `స‌ర్క‌స్`.. `భాయిజాన్`  చిత్రాల్లో..  త‌మిళ్ లో విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. అలాగే పూజా హెగ్దే ఆల్ అబౌట్ ల‌వ్ అనే ఓ స్వ‌చ్ఛంగా సంస్థ  ద్వారా సామాజికి సేవ చేస్తోంది. త‌న సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్నాన‌ని తెలిపింది. ఏడాది కాలంగా సంస్థ బాగా న‌డుస్తుంద‌న్నారు. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాల్ని అందరూ ప్రోత్స‌హించాల‌ని కోరారు.