Begin typing your search above and press return to search.

#షేడ్స్ ఆఫ్ ప్రేర‌ణ‌.. ఎవరికోస‌మో గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో ఆ ఎదురు చూపులు?

By:  Tupaki Desk   |   13 Feb 2021 12:22 PM IST
#షేడ్స్ ఆఫ్ ప్రేర‌ణ‌.. ఎవరికోస‌మో గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో ఆ ఎదురు చూపులు?
X
ప్రేమికుల రోజు (ఫిబ్ర‌వ‌రి 14) రాక ముందే అభిమానుల‌కు అదిరిపోయే ట్రీటిచ్చింది రాధేశ్యామ్ టీమ్. ప్రీటీజ‌ర్ త‌ర్వాత అస‌లు టీజ‌ర్ 14ఫిబ్ర‌వ‌రి ల‌వ‌ర్స్ డే కానుక‌గా రిలీజ‌వుతోంది. ఈ టీజ‌ర్ ఎలా ఉండ‌బోతోందో అన్న ఎగ్జ‌యిట్ మెంట్ ప్ర‌భాస్ అభిమానుల్లో అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇంకొన్ని గంట‌ల్లోనే ఆ స‌స్పెన్స్ కి తెర ప‌డ‌నుంది.

ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందే ప్రేర‌ణ నుంచి కూడా ట్రీట్ అందింది. ఈ భామ త‌న అభిమానుల కోసం అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. #షేడ్స్ ఆఫ్ ప్రేర‌ణ పేరుతో ఈ ఫోటోల్ని పూజా రిలీజ్ చేసింది. తాజా ఫోటోలో ఫ్రీజ్ అవుతున్న ప్రేర‌ణ ఎవ‌రి కోస‌మో వేచి చూస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇక యూర‌ప్ వీధుల్లో ప్ర‌భాస్.. పూజా మ‌ధ్య ల‌వ్ స్టోరి ర‌క్తి క‌ట్టించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇటలీలో మంచు కురిసే చోట గ‌డ్డ క‌ట్టే చ‌లిలో పూజా ఇలా భారీ కోట్ ధ‌రించింది. చేతుల‌కు గ్లోవ్స్ స‌హా హెడ్ ని క‌వ‌ర్ చేస్తూ మ‌ఫ్ల‌ర్ కూడా ధ‌రించింది. ప్ర‌తి షేడ్ లో యూరోప్ వెద‌ర్ ఎలివేట్ అయ్యింది. ఇక ఇంత‌కుముందే అదే లొకేష‌న్ లో డార్లింగ్ ప్ర‌భాస్ గుండె స‌వ్వ‌డిని ఎలివేట్ చేసే వీడియో కూడా అంతే వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిన‌దే.

వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది.
ద‌స‌రా కానుక‌గా ప్రేర‌ణ పాత్ర ఫస్ట్ లుక్ రిలీజై వైర‌ల్ అయ్యింది. తాజాగా ఈ సిరీస్ లో కొత్త ఫోటోలు ఆక‌ట్టుకుంటున్నాయి. #ShadesOfPrerana .. `ఇన్ స్టాగ్ర‌మ్ Vs రియాలిటీ` పేరుతో వీటిని రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. త‌దుప‌రి పూజా వ‌రుస చిత్రాల‌తో బిజీ బిజీగా ఉంది. అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ తో పాటు ఆచార్య‌లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ సిర్కస్ సెట్స్ కి వెళ్లాల్సి ఉంటుంది.