Begin typing your search above and press return to search.
#రాధేశ్యామ్.. క్లైమాక్స్ కోసం అంత రిస్క్ చేశారా?
By: Tupaki Desk | 16 Dec 2020 12:20 PM ISTబ్యాక్ టు బ్యాక్ సినిమాల తో హీట్ పెంచిన ప్రభాస్ సాధ్యమైనంత తొందరగా రాధేశ్యామ్ చిత్రీకరణను పూర్తి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తవుతోందని సమాచారం.
గత నెల లో ఇటాలియన్ షెడ్యూల్ తరువాత డిసెంబర్ 13 నుంచి హైదరాబాద్ లో ఒక ప్రధాన షెడ్యూల్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. యూనిట్ ప్రస్తుతం కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తోంది.
తాజా నివేదికల ప్రకారం.. రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ షెడ్యూల్ కోసం పాతకాలపు ఇటలీని పోలిన నాలుగు వేర్వేరు సెట్లను ఏర్పాటు చేశారు. ఈ నాలుగు సెట్లలో షూటింగ్ జరుగుతోంది. ఈ నెల చివరి వరకు కొనసాగనున్న షెడ్యూల్ లో ప్రభాస్ - పూజా హెగ్డేతో పాటు ఇతర ప్రధాన నటులు పాల్గొంటున్నారు.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపికృష్ణ మూవీస్- యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.