Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ పై 'రాధేశ్యామ్' టీమ్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   3 Jan 2022 3:02 PM IST
రిలీజ్ డేట్ పై రాధేశ్యామ్ టీమ్ క్లారిటీ..!
X
దేశ వ్యాప్తంగా మళ్ళీ విజృభిస్తున్న కోవిడ్ కేసులతో సినిమాల విడుదలలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నేషనల్ వైడ్ రిలీజ్ అయ్యే పాన్ ఇండియా చిత్రాలకు కరోనా వైరస్ మరియు దాని కొత్త వేరియంట్ సమస్యలు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 50 శాతం అక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసాయి. ఇదే క్రమంలో మరికొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించబోతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించి ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న 'రాధేశ్యామ్' సినిమాని కూడా పోస్ట్ పోన్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ట్విట్టర్ లో ‘రాధేశ్యామ్’ హ్యాష్ ట్యాగ్ ఆదివారం ట్రెండ్ అయింది.

'రాధే శ్యామ్' చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభాస్ సినిమా రిలీజ్ పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. దీనికి తోడు చిన్న సినిమాలన్నీ వరుస పెట్టి సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించడంతో మరో పాన్ ఇండియా మూవీ వాయిదా పడినట్లే అని అనుకునే పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో 'రాధేశ్యామ్' డిజిటల్ టీం రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే ప్రభాస్ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే పుకార్లను నమ్మవద్దని పేర్కొన్నారు. దీంతో డార్లింగ్ అభిమానులకు కాస్త ఊరట లభించినట్లయింది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే సందేహాలు మాత్రం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

అలానే ఒకవేళ చెప్పిన సమయానికే 'రాధే శ్యామ్' సినిమాని విడుదల చేయాలని అనుకుంటే.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేయాలని.. స్పెషల్ ఇంటర్వూలు ప్లాన్ చేయాలని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రచార కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూడాలి.. ఈ రూమర్స్ కు చెక్ పెట్టే విధంగా మేకర్స్ ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ వదులుతారేమో చూడాలి.

కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ''రాధే శ్యామ్'' సినిమా తెరకెక్కింది. ఇదొక వింటేజ్ పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి.