Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌ లవ్‌ స్టోరీ మాత్రమే కాదు అంతకు మించి..!

By:  Tupaki Desk   |   10 March 2022 12:30 AM GMT
రాధేశ్యామ్‌ లవ్‌ స్టోరీ మాత్రమే కాదు అంతకు మించి..!
X
కరోనా కష్ట కాలం తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు రాబోతున్న అతి పెద్ద సినిమా రాధేశ్యామ్‌. ఈ రెండేళ్ల కాలంలో ఒక్కటి రెండు సినిమా లు తప్ప పెద్దగా సినిమా లు 2019 సంవత్సరంలో వచ్చిన స్థాయిలో వసూళ్లను కాని రెస్పాన్స్ ను కాని దక్కించుకోలేదు. రాధేశ్యామ్‌ సినిమా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లతో కుమ్మేయడం కోసం ఎదురు చూస్తూ ఉంది. అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అంతా కూడా అయిదు వందల కోట్లు ఖాయం అంటూ నమ్మకంగా ఉన్నారు.

సినిమా గురించిన విషయాలు.. విశేషాలు అంచనాలను రోజు రోజుకు పెంచుతూనే ఉన్నాయి. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. ఇప్పటికే ఈయన ఈ సినిమా యాంటీ క్లైమాక్స్ తో ముగియదు అంటూ తెలియ జేయడంతో అభిమానులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ కథను రాసుకున్న తాను ఒక అద్బుతంగా తెరకెక్కించడానికి ప్రభాస్ మరియు యూవీ క్రియేషన్స్ వారు మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా లో ఫైట్లు ఉండవు.. చేజింగ్ లు యాక్షన్‌ సన్నివేశాలు భారీ డైలాగ్స్ ఉండవు. కాని ఈ సినిమాలో ప్రేమ కోసం ఒక పెద్ద యుద్దమే జరుగుతుందని.. ప్రేమ డైలాగ్స్ భారీ డైలాగ్స్ ను మించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచి పోతాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నాడు. మరో వైపు ఈయన సినిమా గురించి మరింతగా అంచనాలు పెంచే విధంగా కామెంట్స్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఈయన చేసిన వ్యాఖ్యలు సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి.

మొదటి నుండి ఈ సినిమాను ఒక ప్యూర్‌ లవ్‌ స్టోరీ అంటూ ప్రచారం చేస్తున్నారు. లవ్‌ స్టోరీ మాత్రమే కాకుండా ఈ సినిమా ఒక అద్బుతమైన థ్రిల్లర్ అని కూడా దర్శకుడు చెప్పుకొచ్చాడు. సినిమా కథ మరియు సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌ కు గురి చేస్తాయని ఆయన చెబుతున్నాడు. ప్రతి సన్నివేశం కూడా అద్బుత లోకాల్లో విహరించేలా చేస్తాయని ఆయన చెబుతూ ఉంటే సినిమా ను ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తుంది.

ప్రభాస్‌ మరియు పూజా హెగ్డే ల లుక్‌ లకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమా మొత్తం కూడా ఒక అందమైన పెయింటింగ్‌ మాదిరిగా ఉంటుందని మేకర్స్ చెబుతూ వచ్చిన విషయం నిజమే అన్నట్లుగా ట్రైలర్‌ మరియు టీజర్ లు ఉన్నాయి. ఇద్దరి మద్య ఒక అద్బుతమైన ప్రేమ కథ.. ఆ ప్రేమ కథ క్లైమాక్స్ లో దాదాపుగా పావు గంట ఉండే ఓడ ఎపిసోడ్‌ ఇలా ప్రతి ఒక్కటి కూడా సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంలో ఉపయోగపడుతాయని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

రికార్డు బ్రేకింగ్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ అవుతున్న రాధేశ్యామ్‌ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందేమో చూడాలి.