Begin typing your search above and press return to search.
#రాధేశ్యామ్ ఈ రూమరే నిజమైతే సెన్సేషనే
By: Tupaki Desk | 4 April 2021 1:00 PM ISTప్రభాస్- పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ జూలై 30న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళం-హిందీలో ఈ సినిమా ఏక కాలంలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగానే.. రాధేశ్యామ్ గురించిన ఒక్కో లీక్ అంతకంతకు ఉత్కంఠ పెంచేస్తోంది.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా కథాంశంలో మరణం మిస్టరీ అనే ఎలిమెంట్స్ ఆద్యంతం ఉత్కంఠ పెంచుతాయని గుసగుస వినిపిస్తోంది. నాయకానాయికల్లో ఒకరికి ప్రాణభయం. ప్రియుడు లేదా ప్రియురాలిని కాపాడుకునే తాపత్రయం కనిపిస్తుందట. ఇందులో పునర్జన్మల నేపథ్యమా లేక గీతాంజలి తరహాలో ఏదైనా ఇల్ నెస్ ఎలిమెంట్ ఉందా? అన్నదానిపై సరైన స్పష్ఠత లేదు.
ఇక మరో కోణంలోనూ ఈ సినిమాని విశ్లేషిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో అందమైన కొండ కోనల్లో ట్రైన్ రన్ అవుతుంటుంది. అంటే ట్రైన్ అలా వెళుతూ యాక్సిడెంట్ కి గురైతే అందులో ప్రేయసి ఉంటే.. ఆ తర్వాత ఆ ప్రియుడి పాట్లేమిటి? అన్న యాంగిల్ ని కూడా ఊహిస్తున్నారు. ఇక ఇందులో ప్రభాస్ చేయి చూసి జ్యోతిష్యం చెప్పేవాడిగా కనిపిస్తాడు. అంటే పూజా చేయి చూసి జోస్యం చెబుతాడు. కానీ అతడికి తెలిసిన ఆ నిజం నుంచి తనని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుందట. ఆ నిజం యాక్సిడెంటల్ డెత్ అయ్యి ఉంటుందా? అన్నది క్యూరియాసిటీ. ఇక ఇందులో నాయకానాయికల పాత్రలు రెండిటికీ సమప్రాధాన్యం ఉంటుందన్న గుసగుస కూడా యువి సంస్థ సోర్స్ నుంచి లీకైంది.