Begin typing your search above and press return to search.

`రాధేశ్యామ్` హిందీ వెర్ష‌న్‌ సెకండ్ సింగిల్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

By:  Tupaki Desk   |   6 Dec 2021 9:37 AM GMT
`రాధేశ్యామ్` హిందీ వెర్ష‌న్‌ సెకండ్ సింగిల్ టీజ‌ర్ వ‌చ్చేసింది!
X
యంగ్ రెబ‌ల్‌ స్టార్‌ ప్ర‌భాస్ ఇమేజ్ `బాహుబ‌లి` త‌రువాత ఓరేంజ్‌ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ చిత్రాలు వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు సినిమా ఖ్యాతి ని చాటి చెప్ప‌డం తో పాటు ప్ర‌భాస్‌ని పాన్ ఇండియా స్థాయికి మించిన స్టార్‌ గా నిల‌బెట్టాయి.

దీంతో త‌న త‌దుప‌రి చిత్రాల‌ని అదే స్థాయిలో ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హాలీవుడ్ చిత్రాల స్థాయి కి ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో ఆయ‌న త‌న చిత్రాల‌ని చాలా కొత్త‌గా.. డిఫ‌రెంట్‌ గా వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

`సాహో` వంటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ త‌రువాత ప్ర‌భాస్ న‌టిస్తున్న రొమాంటిక్ ల‌వ్ స్టోరీ `రాధేశ్యామ్‌`. బాలీవుడ్‌కు చెందిన టీ సిరీస్ అధినేత భూష‌న్ కుమార్‌తో క‌లిసి యువీ క్రియేష‌న్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ మూవీని అత్యద్భుత‌మైన విజువ‌ల్ వండ‌ర్‌ గా తీర్చిదిద్దుతున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌ గా న‌టిస్తున్న ఈ మూవీలో `మైనే ప్యార్ కియా`( తెలుగులో `ప్రేమ పావురాలు`) ఫేమ్ భాగ్య శ్రీ కీల‌క పాత్ర‌లో ప్ర‌భాస్‌ కు మ‌ద‌ర్‌ గా న‌టించారు. అంతే కాకుండా ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్‌ స్టార్ కృష్టంరాజు ప్ర‌ధాన‌మైన కీల‌క పాత్ర‌లో క‌పిపించ‌బోతున్నారు.

ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌వుతున్న ఈ మూవీని సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 14న ఐదు భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే చిత్ర బృందం ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌చారాన్ని ప్రారంభించేసింది.

ఇటీవ‌ల హిందీ వెర్ష‌న్‌కి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా సెకండ్ హిందీ సింగిల్ `సోచ్‌లియా..` సాంగ్ టీజ‌ర్‌ని సోమ‌వారం విడుద‌ల చేసింది. లిరిక‌ల్ వీడియోని మాత్రం ఈ నెల 8న విడుద‌ల చేస్తున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది చిత్ర బృందం.

జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ తెలుగు వెర్ష‌న్‌ కి సంగీత‌ అందించ‌గా హిందీ వెర్ష‌న్‌కు మిథూన్‌.. అమ‌ల్ మాలిక్‌..మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన `సోచ్‌లియా.. ` సాంగ్ ని మిథూన్ .. మ‌నోజ్ మింతాసిర్ సాహిత్యాన్ని అందించ‌గా అర్జిత్ సింగ్ ఆల‌పించారు. విర‌హ గీతంగా వ‌చ్చే ఈ సాంగ్‌ని చిత్రీక‌రించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

పూజా హెగ్డే భ‌యంతో చ‌ర్చిలో ప్రార్టిస్తున్న విజువ‌ల్స్‌... పూజా హెగ్డేతో క‌లిసి వున్న సంద‌ర్బాల్ని గుర్తు చేసుకుంటూ ప్ర‌భాస్ ఓ న‌ది ఓడ్డున న‌డుస్తున్న సీన్స్‌... అలాగే సాయం స‌మ‌యంలో న‌ది ఒడ్డున డిమ్ లైట్ వెళుతురులో ప్ర‌భాస్ ఓ టేబుల్‌పై కూర్చుని చూస్తున్న స‌న్నివేశాలు ఆక‌ట్టుకునే స్థాయిలో వున్నాయి. విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ యూర‌ప్ నేప‌థ్యంలో పిరియాడిక్ ల‌వ్‌ స్టోరీ గా సాగ‌నుంది.