Begin typing your search above and press return to search.

వీడియో: 'రాధే' - ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ టైటిల్ ట్రాక్..!

By:  Tupaki Desk   |   5 May 2021 7:15 AM GMT
వీడియో: రాధే - ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ టైటిల్ ట్రాక్..!
X
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ''రాధే'' - ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ మే 13న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి థియేట్రికల్ రిలీజ్ తో పాటుగా డిజిటల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ - దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ‘సీటీ మార్’ సాంగ్ - హిమేష్ రేష్మీయా కంపోజ్ చేసిన ‘దిల్ దే దియా’ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘రాధే’ టైటిల్ ట్రాక్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

'రాధే' చిత్రంలో హీరో క్యారక్టరైజేషన్ ని తెలియజేసేలా సాగిన టైటిల్ ట్రాక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇందులో సల్మాన్ ఖాన్ స్వాగ్.. తనదైన స్టైల్‌ లో వేసిన సింపుల్ స్టెప్పులు.. హీరోయిన్ దిశా పటానీ డ్యాన్స్ మూవ్స్ అలరిస్తున్నాయి. ఈ సాంగ్ కి సాజిద్ వాజిద్ ట్యూన్ కంపోజ్ చేశాడు. అంతేగాక సాజిద్ లిరిక్స్ అందించడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఈ పాటకు ముదస్సార్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో సినిమాటోగ్రాఫర్ అవనంక బోస్ అందించిన విజువల్స్ బాగున్నాయి.

'రాధే' చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో సల్మాన్ ఖాన్ ఫిలింస్ - సోహైల్ ఖాన్ ప్రొడక్షన్ - రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి. సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో రణదీప్‌ హుడా విలన్ గా నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్‌ - 'ప్రేమిస్తే' భరత్ - మేఘా ఆకాష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈద్ సందర్భంగా థియేటర్స్ తో పాటుగా ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో జీ ప్లెక్స్‌ - డిష్‌ టీవీ - డీటుహెచ్‌ - టాటా స్కై - ఎయిర్‌ టెల్‌ డిజిటల్‌ టీవీల్లో 'రాధే' సినిమా రిలీజ్ అవుతోంది.