Begin typing your search above and press return to search.

'సీటీమార్' డ్యాన్స్ పట్ల హ్యాపీగా ఉన్న సల్మాన్..!

By:  Tupaki Desk   |   30 April 2021 2:30 PM GMT
సీటీమార్ డ్యాన్స్ పట్ల హ్యాపీగా ఉన్న సల్మాన్..!
X
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ - దిశా పటానీ జంటగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ''రాధే''. కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ చిత్రం మే 13న థియేటర్స్ మరియు డిజిటల్ వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి 'సీటీమార్‌' అనే వీడియో సాంగ్‌ ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాటలో సల్మాన్‌ డ్యాన్స్‌ చూసి ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన డ్యాన్స్ పై పెద్ద ఎత్తున సౌత్ ఆడియన్స్ నుంచి ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ 'సీటీమార్' సాంగ్ కు ట్యూన్ అందించారు. ఇది అల్లు అర్జున్ 'డీజే' సినిమాలోని 'సీటీమార్' పాటకు రీమేక్. తెలుగులో హిట్ అయిన ఈ పాట హిందీ వర్షన్ లో సల్మాన్ డ్యాన్స్ ని బన్నీ స్టెప్పులతో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై ఓ రేంజ్ లో మీమ్స్ వస్తున్నాయి. అయితే ఈ ట్రోల్స్ పై సల్మాన్ ఏమాత్రం బాధ పడటం లేదట. ఈ పాట సూపర్ హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాడట. ఎందుకంటే 55 ఏళ్ల సల్మాన్ కు డ్యాన్స్ లో తన స్ట్రెన్త్ వీక్ నెస్ తెలుసు కాబట్టే వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

తాజాగా 'రాధే' చిత్ర బృందం ‘సీటీమార్‌’ మేకింగ్‌ వీడియో విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ప్రభుదేవా మాట్లాడుతూ 'సల్మాన్ కు ఏ స్టెప్పు చెప్పినా సరే నో చెప్పలేదు. మేము చెప్పిన డ్యాన్స్‌ మూమెంట్స్‌ ని ఆయన ఇష్టంతో చేశారు' అని తెలిపారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ రికార్డ్ స్థాయి వ్యూస్ తో మంచి హిట్ అవడంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయని అందరూ భావిస్తున్నారు.