Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్‌' టీం కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   31 Aug 2020 11:15 AM IST
రాధేశ్యామ్‌ టీం కీలక నిర్ణయం
X
ప్రభాస్‌.. పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న 'రాధేశ్యామ్‌' సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా నిలిచి పోయిన విషయం తెల్సిందే. విదేశాల్లో చిత్రీకరణలో ఉన్న సమయంలో కరోనా మహమ్మారి మొదలవ్వడంతో యూనిట్‌ సభ్యులు షూటింగ్‌ ను మద్యలో వదిలేసి వచ్చేశారు. షూటింగ్స్‌ మొదలు పెట్టడానికి చాలా మంది స్టార్స్‌ భయపడుతున్నా కూడా ప్రభాస్‌ మాత్రం షూటింగ్‌ కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత రెండు భారీ సినిమాలను ఆయన చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమాను పూర్తి చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నాడు.

ఈ సినిమా కోసం హైదరాబాద్‌ లో ఆరు కోట్ల సెట్టింగ్స్‌ ను నిర్మిస్తున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం రియల్‌ లొకేషన్ ల్లో చిత్రీకరించేందుకు మళ్లీ యూనిట్‌ సభ్యులు మొత్తం కూడా యూరప్‌ వెళ్లబోతున్నారట. ఇందుకోసం ప్రత్యేక విమానంలో యూనిట్‌ సభ్యులు ప్రయాణించనున్నారు. త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో కాస్త భయంగా ఉన్నా కూడా ముందుకు సాగుతున్నారు.

రాధేశ్యామ్‌ సినిమా 1980 కాలం నాటి పీరియాడిక్‌ లవ్‌ కమ్‌ ఎంటర్‌ టైనర్‌ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్‌ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.