Begin typing your search above and press return to search.

డార్లింగ్ ఫ్యాన్స్ కు 'రాధే శ్యామ్' టీమ్ గుడ్ న్యూస్..!

By:  Tupaki Desk   |   27 March 2021 2:16 PM GMT
డార్లింగ్ ఫ్యాన్స్ కు రాధే శ్యామ్ టీమ్ గుడ్ న్యూస్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న వింటేజ్‌ లవ్ స్టొరీ ''రాధే శ్యామ్''. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ - గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్‌ - ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో జులై 30న విడుదల చేయనున్నారు. అయితే 'రాధేశ్యామ్' మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాకి బజ్ క్రియేట్ చేయడం లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తూ వస్తున్నారు.

ఇప్పటి వరకు విడుదలైన 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రమోషనల్ కంటెంట్ వదలడం లేదని మేకర్స్ పై డార్లింగ్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌస్ ని ట్రోల్ చేసేవారు కొందరైతే.. రిక్వెస్ట్ చేసేవారు మరొకొందరు. మరి వీళ్ళ మొర అలకించారో ఏమో 'రాధే శ్యామ్' టీమ్ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోందట. వచ్చే నెల నుంచి మొదలుపెట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

'రాధే శ్యామ్' చిత్రంలో జగపతిబాబు - సత్యరాజ్ - భాగ్య‌శ్రీ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - శాషా ఛ‌త్రి - ప్రియ‌ద‌ర్శి - రిద్దికుమార్‌ - స‌త్యాన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ కు మిథున్ - మనన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా.. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.