Begin typing your search above and press return to search.

షాక్ : `రాధేశ్యామ్`ని లైట్ తీస్కున్నారా?

By:  Tupaki Desk   |   19 Aug 2020 11:30 AM IST
షాక్ : `రాధేశ్యామ్`ని లైట్ తీస్కున్నారా?
X
రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక‌దాని వెంట ఒక‌టిగా క్రేజీ పాన్ వ‌ర‌ల్డ్ సినిమాల్ని ప్ర‌క‌టిస్తుంటే అభిమానులు షాక్ ల మీద షాక్ లు తింటున్నారు. మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్.. తానాజీ ఫేం ఓం రౌత్ ల‌తో సినిమాల్ని ప్ర‌క‌టించ‌గానే ఔరౌరా! అంటూ నోరెళ్ల‌బెట్టారు. ఇవి రెండూ పాన్ వ‌ర‌ల్డ్ కేట‌గిరీనే. వీటిలో ఒక‌టి సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ కాగా మ‌రొక‌టి పురాణేతిహాసం ఆధారంగా తెర‌కెక్కుతున్న 3డి సినిమా. దీంతో అభిమానుల్లో ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుత ప్రాజెక్ట్ రాధే శ్యామ్ ని అంతా ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు.

ఇంత‌కీ ప్ర‌భాస్ న‌టిస్తున్న 20వ సినిమా `రాధే శ్యామ్` షూటింగ్ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది? తాజా అప్ డేట్ ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్నిస్తే.. గ‌త నాలుగైదు నెల‌లుగా క్రైసిస్ లో లాక్ అయిపోయారంతా. దీంతో పెండింగ్ షూటింగ్ ఎపుడో తేల‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అక్టోబర్ నుంచి తిరిగి రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభం కానుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2021 వేసవి ప్రారంభంలో విడుదల లక్ష్యంగా పని చేయ‌నున్నార‌ట‌.

అలాగే ఈ మూవీ కోసం ట్యాలెంటెడ్ జిబ్రాన్ బ‌రిలో దిగార‌న్న‌ది తాజా అప్ డేట్. ప్ర‌భాస్ గ‌త చిత్రం `సాహో` టీజర్ స‌హా ట్రైలర్ కోసం నేపథ్య సంగీతాన్ని అందించిన ప్రతిభావంతుడైన‌ సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్ బ‌రిలో దిగ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. రాధే శ్యామ్ రీ-రికార్డింగ్ బీజీఎంపై కూడా అత‌డు పని చేస్తున్నారట‌.

`రాధేశ్యామ్` టైటిల్ కి త‌గ్గ‌ట్టే పీరియడ్ లవ్ స్టోరీ కాబట్టి అందుకు త‌గ్గ‌ట్టు ఆ కాలంలోకి తీసుకెళ్లేలా ట్రాన్స్ ని మ్యూజిక్ ద్వారానే క్రియేట్ చేయాలి. ఆ రోల్ ఎంతో టిఫిక‌ల్ అనే చెప్పాలి. గిబ్రాన్ లాంటి ప్ర‌తిభావంతుడితోనే ఇదంతా సాధ్య‌మ‌ని భావించి ఆ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించార‌ట‌. అంతేకాదు.. నెవ్వ‌ర్ బిఫోర్ అనే రేంజులో ప్ర‌త్యేకించి బిజిఎంని రెడీ చేయడానికి అతనికి తగినంత సమయం ఇస్తున్నారు. రాధే శ్యామ్ లో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. యువి క్రియేషన్స్ - టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.