Begin typing your search above and press return to search.

జ‌స్ట్ 10 రోజుల్లో అంతా అయిపోవాల్సింది.. కానీ ఇంతలోనే..!

By:  Tupaki Desk   |   29 April 2021 6:33 AM GMT
జ‌స్ట్ 10 రోజుల్లో అంతా అయిపోవాల్సింది.. కానీ ఇంతలోనే..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ''రాధే శ్యామ్''. 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1960ల నాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణ పాత్రలో పుజా నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 30న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. కొద్దిగా ప్యాచ్ వర్క్ - వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. జస్ట్ 10 రోజుల షూటింగ్ తో అంతా పూర్తవుతుంది అనుకుంటుండగా.. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్స్ వేసింది.

'రాధే శ్యామ్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న కృష్ణంరాజు మరియు హీరోయిన్ పూజా హెగ్డే లకు సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేస్తే మొత్తం చిత్రీక‌ర‌ణ ముగిసిన‌ట్లే. జూలై 30 లోపు క‌రోనా ప్రభావం త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌నే ఆశ‌తో మేకర్స్ ఇంకా విడుద‌ల తేదీని కూడా మార్చ‌లేదు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు పూజా క‌రోనా బారిన పడిన కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మ‌రో వారం రోజుల్లో ఒకవేళ ప్ర‌భుత్వం లాక్ డౌన్ ప్ర‌క‌టిస్తే కనుక 'రాధేశ్యామ్' పెండింగ్ షూట్ జ‌ర‌గ‌డం చాలా కష్టం అవుతోంది. దీంతో అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వ‌డం కాస్త క‌ష్ట‌మే అని చెప్పొచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, 'రాధే శ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌ - యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. హిందీలో టీ-సిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో జగపతిబాబు - సత్యరాజ్ - జయరాజ్ - భాగ్య‌శ్రీ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - శాషా ఛ‌త్రి - ప్రియ‌ద‌ర్శి - రిద్దికుమార్‌ - స‌త్యాన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిథున్ - మనన్ భరద్వాజ్ హిందీ వెర్షన్ సంగీతం సమకూరుస్తుండగా.. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.