Begin typing your search above and press return to search.

ప్రభాస్ రాధేశ్యామ్ వచ్చేది అప్పుడే..?

By:  Tupaki Desk   |   27 Dec 2020 7:00 AM IST
ప్రభాస్ రాధేశ్యామ్ వచ్చేది అప్పుడే..?
X
‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.. అతని స్టార్ డమ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ‘రాధే శ్యామ్’తో రాబోతున్నాడు ప్రభాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై అందరి దృష్టి నెలకొంది.

‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా పలువురు బాలీవుడ్ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. చిత్రీకరణ ఫైనల్ స్టేజ్ కి చేరుకోవడంతో రిలీజ్ డేట్ ఎప్పుడు అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ లో విడుదల చేసేందుకు చూస్తున్నారట దర్శకనిర్మాతలు. సమ్మర్ లో రిలీజ్ కావడానికి తెలుగులో, హిందీలో చాలా చిత్రాలు ఉన్నాయి. కాబట్టి జూన్ లో రిలీజ్ చేయాలని యోచిస్తున్నారట. ముందుగానే ఈ టైం ప్రకటించడం వల్ల ఇతర సినిమాలు పోటీలో లేకుండా చూడాలని భావిస్తున్నారట మేకర్స్.

ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాగో చాలా సమయం పడుతుంది. ప్రశాంతంగా ఈ పనులు చూసుకొని జూన్ లో రిలీజ్ చేస్తే ఏ ఇబ్బందీ ఉండదనేది దర్శక నిర్మాతల భావన. అయితే.. ఫైనల్ గా ఏం చేయబోతున్నారనేది సంక్రాంతి తర్వాతే తేలనుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.