Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్ చివరి షెడ్యూల్ అప్ డేట్
By: Tupaki Desk | 19 Nov 2020 12:40 PM ISTప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయ్యింది. ఈ నెల ఆరంభం వరకు ఇటలీలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా రెండు వారాల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ డిసెంబర్ చివరి వరకు ఉంటుందని.. దాంతో షూటింగ్ పూర్తి అవుతుందంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత వారం ముంబయికి ఆదిపురుష్ చర్చల కోసం వెళ్లిన ప్రభాస్ ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. వెంటనే రాధేశ్యామ్ షూటింగ్ లో ఆయన పాల్గొనేందుకు సిద్దం అయ్యాడు.
రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఒక ప్రత్యేకమైన భారీ సెట్టింగ్ లో ఈ చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రభాస్.. పూజా హెగ్డేలతో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి దాదాపుగా రెండేళ్లు అవుతుంది. సాహో విడుదలకు ముందే ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతికి రాధేశ్యామ్ ను విడుదల చేయాలనుకున్నారు. కాని థియేటర్ల విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో విడుదల తేదీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మార్చి లేదా ఏప్రిల్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ మరియు ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడంలో విడుదల చేయబోతున్నారు.