Begin typing your search above and press return to search.

రాధే.. భాయ్ ఊపు చూస్తుంటే చిత‌క్కొట్టేట్టున్నాడు!

By:  Tupaki Desk   |   14 March 2021 1:30 AM GMT
రాధే.. భాయ్ ఊపు చూస్తుంటే చిత‌క్కొట్టేట్టున్నాడు!
X
సల్మాన్ ఖాన్ సినిమా అంటే యాక్షన్- డ్రామా- ఎంటర్ టైన్మెంట్ కు కేరాఫ్‌ అనే చెప్పాలి. అత‌డు న‌టించిన `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` ఇదే కేట‌గిరీలో వస్తున్న భారీ సినిమా. థియేట‌ర్ల‌లోకి రాధే రాక‌ కోసం అభిమానులు చాలా కాలంగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-డ్రామా 2021 మోస్ట్ అవైటెడ్ మూవీగా రికార్డుల‌కెక్కింది. రాధే తాజా పోస్టర్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.

# సల్మాన్ ఖాన్ ఈద్ బ‌రిలో మే 13 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు సరిగ్గా రెండు నెలల సమయం ఉండటంతో సల్మాన్ ఖాన్ కొత్త పోస్టర్ తో ప్ర‌చారం ప‌రంగా వేడి పెంచారు. స‌ల్మాన్ ఈ పోస్ట‌ర్ లో భీక‌రాకారంతో క‌నిపిస్తున్నారు. కండ‌లు మెలితిరిగిన దేహంతో అత‌డు గ‌న్ చేత‌ప‌ట్టి సీరియ‌స్ గా క‌నిపిస్తున్నాడు. త‌న చుట్టూ పోస్ట‌ర్ లో బర్నింగ్ హెలికాప్టర్లు ఫిరంగిదళాలతో యుద్దభూమి నేపథ్యంలో సెట‌ప్ ఉత్కంఠ పెంచుతోంది. రాధే నెవ్వ‌ర్ బిఫోర్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

స‌ల్మాన్ సినిమాలు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాయి. రాధే 2021లో అతిపెద్ద సినిమాల్లో ఒకటి. మ‌హ‌మ్మారీ వ‌ల్ల‌ కఠినమైన సంవత్సరం తర్వాత అభిమానులకు ఇది చాలా ప‌సందు పంచ‌నుంద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు."సల్మాన్ ఖాన్ కు ఈద్ కు ప్రత్యేక సంబంధం ఉంది. యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ తో సంప్రదాయాన్ని కొనసాగించడం ఆనందంగా ఉంది. చప్పట్లు కొట్టి ఈలలు వేస్తూ సల్మాన్ ఖాన్ మూవీ మ‌రోసారి 'హౌస్-ఫుల్' బోర్డులతో ద‌ర్శ‌న‌మిస్తుంది`` అని వ్యాఖ్యానించారు.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు దిషా పటాని- రణదీప్ హుడా- జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్- సోహైల్ ఖాన్ -రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ZEE స్టూడియోస్ సహకారంతో సినిమా రిలీజ‌వుతోంది. ఈద్ సందర్భంగా 2021 మే 13 న ఈ చిత్రం విడుదలవుతుంది.