Begin typing your search above and press return to search.

కామెంట్ ఆఫ్ ది డే: 'వాలిమై' చిత్రానికి 'రాధే' క‌ల‌ర్స్ క‌నిపిస్తున్నాయే..!!

By:  Tupaki Desk   |   12 July 2021 5:30 PM GMT
కామెంట్ ఆఫ్ ది డే: వాలిమై చిత్రానికి రాధే క‌ల‌ర్స్ క‌నిపిస్తున్నాయే..!!
X
కోలీవుడ్ స్టార్ హీరో 'తలా' అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''వాలిమై''. హెచ్‌.వినోద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో బేవ్యూ ప్రొజెక్ట్స్‌ బ్యానర్ పై బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నెర్కొండ పార్వై’ తర్వాత అజిత్ - వినోద్ - బోనీకపూర్ కలయికలో వస్తున్న సినిమా ఇది. ఇందులో సీబీ సీఐడీ ఆఫీసర్ గా అజిత్ కనిపించనున్నారు. వాలిమై ఫస్ట్ లుక్ కోసం ఎంతో కాలంగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏడాది కాలంగా అజిత్ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. హీరో బర్త్ డేకు కూడా అప్డేట్ ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన ఫ్యాన్స్.. ఒకానొక దశలో ప్రొడక్షన్ హౌస్ మీద నెగెటివ్ ట్రెండ్ కూడా చేశారు.

ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వెయిట్ చేసిన అభిమానులకు అజిత్ డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఆదివారం ''వాలిమై'' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటుగా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. ఎట్టకేలకు అజిత్‌ సినిమా ఫస్ట్‌ లుక్ వచ్చిందని సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో యాంటీ ఫ్యాన్స్ అజిత్ ఫస్ట్ లుక్ పై నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. 'వాలిమై' ఫస్ట్ లుక్ ఓ టీవీ యాడ్ నుంచి కాపీ చేసారని స్క్రీన్ షార్ట్స్ పెడుతూ ట్రోలింగ్ మొదలు పెట్టేసారు. అంతేకాదు 'వాలిమై' మోషన్ పోస్టర్ చూస్తుంటే 'రాధే' కలర్స్ కనిపిస్తున్నాయని కామెంట్స్ పెడుతున్నారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ''రాధే: మోస్ట్ వాంటెడ్ భాయ్''. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈద్ సందర్భంగా ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. ఇప్పుడు ''వాలిమై'' మోషన్ పోస్టర్ 'రాధే' ని పోలి ఉందని.. ఆద‌మ‌రుపుగా చూస్తే స‌ల్మాన్ ఖాన్ సినిమా అనుకునేవారు కూడా లేకపోలేదని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అజిత్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఏదేమైనా వరుస హిట్స్ తో దూకుడు మీదున్న అజిత్ కుమార్ నుంచి వస్తున్న ''వాలిమై'' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ రానుంది. ఇందులో అజిత్‌ సరసన 'కాలా' ఫేమ్ హ్యుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. 'Rx100' హీరో కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి నిరావ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ వెలికుట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదిలా ఉండగా 'వాలిమై' ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' ఫస్ట్ లుక్ రికార్డ్స్ ను ఇది బీట్ చేసింది. 'ఆర్ ఆర్ ఆర్' ఫస్ట్ లుక్ 463K లైక్స్ తెచ్చుకున్న సమయంలో 'వాలిమై' ఫస్ట్ లుక్ కు ఒక మిలియన్ కు పైగా లైక్స్ రాబట్టింది. మరి అజిత్ నుంచి రెండేళ్ల తర్వాత రాబోతున్న ''వాలిమై'' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ నమోదు చేస్తుందో చూడాలి.