Begin typing your search above and press return to search.

ఆ `వ్యాంప్` త‌న‌ని నాశ‌నం చేసింద‌ని వాపోయిన న‌టి

By:  Tupaki Desk   |   3 Dec 2020 2:00 PM IST
ఆ `వ్యాంప్` త‌న‌ని నాశ‌నం చేసింద‌ని వాపోయిన న‌టి
X
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా తేజ‌కు మంచి పేరున్న విష‌యం తెలిసిందే. అంతే స్థాయిలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా కూడా పేరుంది. త‌ను రూపొందించే చిత్రాల్లో ఎవ‌రు న‌టించినా వారిని కొట్టడం.. త‌న‌కు కావాల్సిన అవుట్ ‌పుట్ రాబ‌ట్టుకునే క్ర‌మంలో న‌టీన‌టుల‌ని కొట్ట‌డం.. ఏకంగా హీరోల‌ని సైతం కొట్టిన చ‌రిత్ర తేజ‌కు వుంది. ఇలాంటి తేజ ఓ స్టార్ హీరోయిన్ కెరీర్‌నే మార్చివేశాడ‌ట‌. చాలా రోజుల త‌రువాత స‌ద‌రు స్టార్ హీరోయిన్ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టి షాకిచ్చింది.

ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు అందాల రాశి. 90లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాశి అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. త‌మిళంలో న‌క్ష‌త్ర‌గా ఆక‌ట్టుకున్న రాశి తెలుగు- త‌మిళ- క‌న్న‌డ మ‌ల‌యాళ‌ భాష‌ల్లో క్రేజీ స్టార్‌ల‌తో క‌లిసి న‌టించింది. క‌న్న‌డ‌లో దివంగ‌త న‌టుడు విష్ణువ‌ర్థ‌న్,.. మ‌ల‌యాళంలో మెగాస్టార్ మ‌మ్ముట్టితో క‌లిసి న‌టించి అద‌ర‌గొట్టింది. రాశి కెరీర్ మాంచి స్పీడులో వుండ‌గానే ఆమెని వ్యాంప్‌గా మార్చి ఆమె కెరీర్ ని తేజ నాశ‌నం చేశాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది రాశి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించి షాకిచ్చింది.

మ‌హేష్‌తో తేజ రూపొందించిన చిత్రం `నిజం` ఈ మూవీలో రాశి హీరో గోపీచంద్ ప‌క్క‌న వ్యాంప్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ముందు క‌థ మ‌రోలా చెప్పి త‌న‌ని ఒప్పించిన తేజ సెట్ ‌లోకి వెళ్లేస‌రికి మార్చేశార‌ని రాశి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. ముందు మ‌హేష్ బాబు హీరో.. గోపీచంద్, నువ్వు ల‌వ‌ర్స్‌.. మ‌ధ్య‌లో విల‌న్ వ‌స్తాడు.. అని క‌థ చెప్పి ఆ త‌రువాత త‌న పాత్ర స్వ‌రూపాన్నే మార్చేశాడ‌ట‌. ఈ విష‌యం సెట్ లోకి వెళ్లాక త‌న‌కు తెలిసింద‌ని విష‌యం తెలిసిన వెంట‌నే సినిమా నుంచి త‌ప్పుకుంటాన‌ని మేనేజ‌ర్ కి చెబితే ఇండ్ట్రీలో పరువుపోతుంద‌ని ఈసారికి ఇలా కానిచ్చేయండ‌ని చెప్ప‌డంతో తాను స‌రే అనాల్సి వ‌చ్చింద‌ని రాశి చెప్పుకొచ్చింది. ‌