Begin typing your search above and press return to search.

ఇలా ఫోజులిచ్చేందుకు చాలా అల‌సిపోయాను

By:  Tupaki Desk   |   13 Nov 2021 1:30 PM GMT
ఇలా ఫోజులిచ్చేందుకు చాలా అల‌సిపోయాను
X
అందానికి అందం ప్ర‌తిభతో సినీవినీలాకాశంలో నిల‌దొక్కుకున్న రాశీ ఖ‌న్నా ఇటీవ‌ల పూర్తిగా సోష‌ల్ మీడియాల‌కే అంకిత‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రాశీ న‌టించిన తాజా చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. ఈ సంద‌ర్భంగా మ‌రింత‌గా ప‌బ్లిసిటీ స్టంట్ తో ముందుకు రాబోతోంది.

తాజాగా రాశీ ఖ‌న్నా ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. రాశీ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తున్న ఈ ఫోటోషూట్ సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. ``ఇలా ఫోజులిచ్చేందుకు చాలా అల‌సిపోయాను. కానీ ఒక నావికురాలిలా సెయిలింగ్ చేస్తున్నందుకు న‌న్ను నేను ప్ర‌శంసించుకోకుండా ఉండ‌లేను!`` అంటూ రాశీ ఉప్పొంగిపోతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇప్పుడు రాశీ ఖ‌న్నా ప‌లికిన ఓ డైలాగ్ అంతే ఇదిగా యూత్ లో వైర‌ల్ అవుతోంది. ``ఇక్కడ ఈ ఎక్స్ ప్రెషన్ పెట్టకూడదు.. ఇలా పెట్టాలి`` ఇప్పుడు భారతదేశంలో టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ట‌కా ట‌క్ స‌హా ఎన్నో యాప్ లలో ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ ఇది. ఆ ఒక్క డైలాగ్ ట్రెండింగ్ లో ఉందిప్పుడు. వీడియో షేరింగ్ వేదిక‌ల‌పై అందాల‌ రాశి ఖన్నా పాపులారిటీ అమాంతం పెరిగింది.

ప‌క్కా హిట్ కొడ‌తాన‌ని రాశీ న‌మ్మ‌కం!

`పక్కా కమర్షియల్` టీజర్ ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. దీని నుండి రాశి ఖ‌న్నా ప‌లికిన‌ ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళ్లిపోతోంది. ఇక ఆ డైలాగ్ చెబుతూ రాశీ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్ గుండెల్లో కి దూసుకెళ్లింది. రాశీ ఆ విజువ‌ల్ లో ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. ``ఇక్కడ ఈ ఎక్స్ ప్రెషన్ పెట్టకూడదు`` అని చెప్పి ``ఇలా పెట్టాలి`` అంటూ చెప్పే స్టైల్ ఎంతో ఫ‌న్నీగా ఉంటుంది.

ఇక ఇదే టీజ‌ర్ లో గోపిచంద్ ఎంతో స్టైలిష్ యాక్ష‌న్ తో క‌ట్టిప‌డేశాడ‌నే చెప్పాలి. అయినా దానిని మ‌ర్చిపోయేంత‌గా రాశీ ఖ‌న్నా ఎక్స్ ప్రెష‌న్స్ డైలాగ్ గుర్తుండిపోయిందంటే అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి క‌నెక్ట‌యితే ఈ రేంజులోనే పేల్తుంది ఏదైనా! కేవ‌లం ఒకే ఒక్క‌ డైలాగ్ వివిధ యాప్ లలో వైరల్ గా మారింది. యువ ఔత్సాహిక న‌టులు రాశీ పంచ్ డైలాగ్ ని స‌ద్వినియోగం చేస్తూ వ‌రుస‌గా వీడియోలను రూపొందించడంలో బిజీగా ఉన్నారు.