Begin typing your search above and press return to search.

పండగ కోసం ఓ పాట పాడేసిన రాశి

By:  Tupaki Desk   |   5 Dec 2019 7:01 AM GMT
పండగ కోసం ఓ పాట పాడేసిన రాశి
X
టాలీవుడ్ లో మల్టి టాలెంటెడ్ అనిపించుకునే హీరోలు హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి లిస్టులో బ్యూటిఫుల్ రాశి ఖన్నా కూడా ఉంది. రాశి జస్ట్ నటి మాత్రమే కాదు అప్పుడప్పుడు గొంతు సవరించుకుని పాటలు పాడుతుంది. ఏదో పాడాం అంటే పాడాం అన్నట్టు కాకుండా నిజమైన సింగర్ లాగా ప్రయత్నం చేస్తుండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

రాశి ఇప్పటి వరకూ నాలుగు పాటలు పాడింది. మొదటి సారిగా 'జోరు' సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది. తర్వాత 'బాలకృష్ణుడు' సినిమా లో మరో పాట పాడింది. సాయి ధరమ్ తేజ్ 'జవాన్' లో 'బంగారూ' అంటూ సాగే మరో పాటను పాడి సంగీత ప్రియులను మెప్పించింది. మలయాళంలో 'విలన్' సినిమాకు ప్రమోషన్ సాంగ్ పాడింది. ఇదిలా ఉంటే తాజాగా రాశి మరోసారి సింగర్ అవతారం ఎత్తింది. సాయి ధరమ్ తేజ్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ప్రతిరోజూ పండగే' సినిమాకోసం ఒక పాట పాడింది. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. వరసగా హిట్ సాంగ్స్ వదులుతూ మంచి జోరు మీద ఉన్న థమన్ ఈసారి రాశి ఖన్నా కోసం ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో తెలియాలంటే వేచి చూడకతప్పదు.

సినిమాల విషయానికి వస్తే రాశి నటించిన రెండు సినిమాలు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందు లో ఒకటి 'వెంకీమామ' కాగా మరొకటి 'ప్రతిరోజూ పండగే'. ఈ సినిమాలు కాకుండా విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.