Begin typing your search above and press return to search.

అందాల రాశీ ద‌శ తిరిగింది మామా!

By:  Tupaki Desk   |   23 Dec 2019 9:21 AM GMT
అందాల రాశీ ద‌శ తిరిగింది మామా!
X
దిల్లీ నుంచి హైద‌రాబాద్ గ‌ల్లీ కి వ‌చ్చి ఇక్క‌డ స‌త్తా చాటుతోంది రాశీ ఖ‌న్నా. టాలీవుడ్ లో ఐదారేళ్లు గా త‌న కెరీర్ ని షేప‌ప్ చేసుకున్న తీరు ఇంప్రెస్సివ్ అనే చెప్పాలి. వ‌రుస‌గా యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించిన రాశీ త‌న కెరీర్ బండిని సాఫీ గా సాగిస్తోంది. హిట్టు ఫ్లాపు తో సంబంధం లేకుండా రాశీకి ఫాలోయింగ్ పెరిగింది.

ముఖ్యంగా 2018-19 సీజ‌న్ త‌న‌కు బాగా క‌లిసొచ్చింది. గ‌త ఏడాది తొలి ప్రేమ చిత్రం తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ బ్యూటీ కి అటు పై ఫ్లాపుల వ‌ల్ల వ‌చ్చిన ముప్పేమీ లేదు. ఈ ఏడాది ఏకంగా నాలుగైదు చిత్రాల్లో నటించి ప్రూవ్ చేసుకుంది. తాజాగా రిలీజైన వెంకీమామ‌- ప్ర‌తి రోజూ పండగే చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించడం త‌న‌ కు పెద్ద ప్ల‌స్ అవుతోంది. త‌దుప‌రి విజ‌య్ దేవ‌ర‌ కొండ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ్ చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా త‌న‌కు వచ్చిన డోఖా ఏమీ లేదు. త‌దుప‌రి బిగ్ లైన‌ప్ కి ప్లాన్ చేసుకోవ‌డం లో బిజీ బిజీగా ఉంది.

ఇక రాశీకి స‌క్సెస్ తో పనే లేకుండా యూత్ లో అద్భుత మైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో 40ల‌క్ష‌లు పైగా అభిమానులు ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌న నుంచి వ‌చ్చే ప్ర‌తి అప్ డేట్ కోసం ఆసక్తిగా వేచి చూస్తుంటారు. త‌న ఫోటో షూట్ల‌ కు అంతే గిరాకీ ఉంటుంది. ఇక రాశీని లైమ్ లైట్ లో ఉంచేందుకు సోష‌ల్ మీడియా ఎప్పుడూ ఏదో ఒక హాట్ డిబేట్ ని తెర‌ పైకి తెస్తుంటుంది. ఇక సోష‌ల్ మీడియా లో ట్రోల‌ర్స్ కి అదిరి పోయే కౌంట‌ర్ ఇచ్చి మ‌రో సారి ట్రెండింగ్ అవుతోది. `నేను ఎవ‌రినీ ప‌ట్టించు కోను!.. ప‌ట్టించుకో వాల్సిన ప‌నే లేదు `` అంటూ సోష‌ల్ ట్రోల‌ర్స్ కి ఒకే ఒక్క పోస్టింగు తో చెక్ పెట్టేసింది అమ్మ‌డు.