Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా టైమ్ అస్సలు బాగా లేనట్లుంది

By:  Tupaki Desk   |   23 July 2022 3:30 PM GMT
రాశి ఖన్నా టైమ్ అస్సలు బాగా లేనట్లుంది
X
ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా టాలీవుడ్‌ లో భారీ సక్సెస్ లేకున్నా చిన్న పాటి సినిమాలతో ఒక మోస్తరు సినిమాలతో కెరీర్‌ ను కంటిన్యూ చేస్తోంది. ఈమె నటించిన సినిమా లు బ్లాక్ బస్టర్ అయినవి చాలా తక్కువ. అయినా కూడా రాశి ఖన్నా కు ఇన్నాళ్లుగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

హీరోయిన్ గా రాశి ఖన్నా స్టార్‌ డమ్‌ ను దక్కించుకోవడం కోసం చాలా కష్టపడి బరువు తగ్గింది. అంతే కాకుండా కాస్త ఇబ్బందైనా స్కిన్‌ షో చేస్తోంది.

ఐనా కూడా ఈ అమ్మడికి దక్కాల్సిన సక్సెస్‌ లు.. అందాల్సిన హిట్స్ రావడం లేదు. రాశి ఖన్నా హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇవ్వలేక పోయింది.

రాశి ఖన్నా తాజాగా థాంక్యూ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్యతో లిప్ లాక్ చేసినా.. కాస్త ఎక్కువ కష్టపడి నటించినా కూడా పెద్దగా ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఆమె సమయం అస్సలు బాగున్నట్లుగా లేదు అంటూ వారు చర్చించుకుంటున్నారు.

ఈమె కు ఆఫర్లు అయితే వస్తున్నాయి కాని అవి సక్సెస్‌ అవ్వక పోవడం.. వాటి వల్ల ఆమె కెరీర్‌ కు ఏమాత్రం బూస్ట్‌ రాకపోవడం అనేది విచారకరం అంటూ అభిమానులు కూడా  విచారం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈమెకు కోలీవుడ్‌ లో మంచి సక్సెస్ లు దక్కాయి. అంతే కాకుండా అక్కడ స్టార్‌ గా మంచి పాపులారిటీని కూడా దక్కించుకుంది.

కనుక ఇక నుంచి ఈ అమ్మడు కోలీవుడ్ కే పరిమితం అయ్యి.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అవకాశాలు ఉన్న చోట.. సక్సెస్ లు దక్కిన చోట ఎక్కువ ప్రయత్నించడం.. కష్టపడటం మంచిది అనేది చాలా మంది అభిప్రాయం. మరి రాశి ఖన్నా ఏం చేయబోతుంది అనేది చూడాలి.