Begin typing your search above and press return to search.

చిక్కిన అందాల రాశి చక్కగుంది

By:  Tupaki Desk   |   17 Jun 2017 12:43 PM GMT
చిక్కిన అందాల రాశి చక్కగుంది
X
చక్కనైన పరువాల అందగత్తె రాశి ఖన్నా. టాలీవుడ్ లో తెగ స్పీడ్ చూపిస్తున్న భామల్లో ఈమె పేరు తప్పకుండా టాప్ లిస్ట్ లోనే ఉంటుంది. డ్యాన్సింగ్ విషయంలో కాసింత వీక్ అనే మాట వినిపించినా.. యాక్టింగ్ ట్యాలెంట్ లో ఏ మాత్రం లోటు చేయదు. అందుకే అవకాశాల విషయంలో ఎప్పటికప్పుడు జోరు చూపిస్తూనే ఉంటుంది.

రాశి ఖన్నా విషయంలో వినిపించే ఒకే ఒక్క విమర్శ.. కాసింత బొద్దుగా ఉంటుందనే. ఈ మాట కెరీర్ ప్రారంభం నుంచి వినిపిస్తున్నా.. ఈ మధ్య ఈ విషయాన్ని బాగా సీరియస్ గా తీసుకుంది ఈ భామ. జిమ్మలు గట్రా తిరిగేస్తూ.. తెగ కాన్సంట్రేషన్ తో సిన్సియర్ గా వర్కవుట్స్ చేసేసింది. వీటి ప్రభావం అమ్మడి ఫిజిక్ పై బాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రాశి ఎంత స్లిమ్ గా అయిపోయిందంటే.. కొత్తగా కత్తిలాంటి ఫిగర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తోందా ఏంటీ అని డౌట్ వచ్చేసే రేంజ్ లో తన బాడీ తీరు మార్చేసుకుంది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ సినిమా రూపొందనుండగా.. ఇందులో రాశి ఖన్నాను లీడ్ హీరోయిన్ పాత్రలోకి తీసుకున్నారు.

కెరీర్ విషయంలో క్లారిటీకి రావాల్సిన సమయంలో వచ్చిన ఆఫర్స్.. అమ్మడి రూట్ ని కంప్లీట్ గా ఛేంజ్ అయిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలి జై లవ కుశ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఈమె.. రవితేజతో కలిసి టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు వరుణ్ తేజ్ మూవీలో కూడా మెయిన్ హీరోయిన్ అవకాశం దగ్గించుకుని తన స్పీడ్ చూపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/