Begin typing your search above and press return to search.

స్కై డైవింగ్ తో జింగ్ జింగ్ అంటోంది

By:  Tupaki Desk   |   5 July 2016 11:41 AM GMT
స్కై డైవింగ్ తో జింగ్ జింగ్ అంటోంది
X
ఒక్కొక్కరికి లైఫ్ లో కొన్ని కోరికలు ఉంటాయి. జింగ్.. జింగ్.. అమేజింగ్ అనిపించేలా ఏదైనా చేయాలని కోరుకుంటూ ఉంటారు. అందరికీ వాటిని నెరవేర్చుకునే అవకాశం రాదు.. వచ్చిన వాళ్లందరూ ఉపయోగించుకోలేరు. కానీ టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా మాత్రం ఛాన్స్ వస్తే వదిలిపెట్టబోనంటోంది. అందుకు తగ్గట్లుగానే తనకు ఎప్పటి నుంచో కోరిక అయిన స్కై డైవింగ్ చేసేసి.. ఆ వీడియోను నెట్ లో పెట్టేసింది.

ప్రస్తుతం రాశి ఖన్నా అమెరికా ట్రిప్ లో భాగంగా చికాగోలో ఉంది. ఏకంగా 14వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసేసింది. అంతే కాదు ఆ వీడియోను నెట్ లో పోస్ట్ చేసి.. తన సాహసాన్ని అభిమానులకు కళ్లారా చూపించింది. 'పొట్టలో సీతాకోక చిలకలు తిరిగిన క్షణం అది. స్కైడైవింగ్ ను ఎంజాయ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నేను అనుకున్నదానికంటే ఎక్కువ థ్రిల్లింగ్ గా హ్యాపీగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది రాశి ఖన్నా. చికాగో నగరంలోని భారీ బిల్డింగులు చీమలుగా కనిపిస్తున్నంత హైట్ నుంచి.. ఓ డైవర్ తో కలిసి అలా దూకేసింది రాశి ఖన్నా.

ఎంజాయ్మెంట్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ భామ.. సినిమాల విషయంలో కూడా మంచి కోఆపరేటివ్ గా ఉంటుంది. గ్లామర్ హీరోయిన్ గా నటించేందుకు ఏ మాత్రం అభ్యంతరం పెట్టకుండా డైరెక్టర్ చెప్పినట్లుగా చేసి.. ఫ్యాన్స్ కి కూడా కనుల విందు చేయడం రాశి ఖన్నా స్పెషాలిటీ. ప్రస్తుతం గోపీచంద్ తో ఆక్సిజన్ షూటింగ్ లో ఉండగా.. రవితేజతో రాబిన్ హుడ్ కు జాయిన్ కావాల్సి ఉంది.