Begin typing your search above and press return to search.
రూటు మారుస్తున్న రాశి ఖన్నా!
By: Tupaki Desk | 12 Sept 2018 7:00 AM ISTఈ ఏడాది తొలిప్రేమలో తన మేకోవర్ లుక్స్ తో అందరికి స్వీట్ షాక్ ఇచ్చి పెర్ఫార్మన్స్ తో కూడా మెప్పించిన రాశి ఖన్నా ఇటీవలే వచ్చిన శ్రీనివాస కళ్యాణం మీద భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అది తీవ్రంగా నిరాశపరచడం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం రాశి ఖన్నా కోలీవుడ్ మీద పెద్ద కన్ను వేసింది. ఇటీవలే నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైక్క నొడిగళ్ లో అధర్వ సరసన చేసిన పాత్ర తనకు మంచి పేరే తీసుకొచ్చింది. సినిమా కూడా హిట్ కావడంతో రాశి ఖన్నా లుక్స్ వాళ్లకు తెగ నచ్చేసాయి. దీని తర్వాత మరో మూడు తమిళ సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. అందులో ఒకటి సిద్దార్థ్ సరసన చేస్తున్న సైతాన్ కా బచ్చా. విశాల్ సరసన టెంపర్ రీమేక్ అయోక్య లో కాజల్ పాత్ర చేస్తోంది కూడా రాశినే. ఇవి కాకుండా మూడోది ఆడంగ మరు కూడా తన ఖాతాలోనే ఉంది. ఇవి లైన్ లో ఉండగానే మరో తమిళ సినిమాకు కూడా సైన్ చేసిందట రాశి ఖన్నా. అంతకు ముందే మలయాళంలో విశాల్ మోహన్ లాల్ లతో విలన్ ద్వారా మల్లు వుడ్ లో అడుగు పెట్టిన రాశి ఖన్నా ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.
తన వరస చూస్తూనే అటువైపే అంకితమవుతుందా అనే అనుమానం రావడం సహజం. విజయ్ దేవరకొండ సరసన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో రాశి ఖన్నానే తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ దాన్ని ధృవీకరించే అవకాశం దగ్గరలో లేదు. విజయ్ దేవరకొండ నోటా ప్రమోషన్ తో పాటు డియర్ కామ్రేడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సో రాశి ఖన్నాకు ఇది మిస్ అయితే దగ్గరలో మరో కొత్త సినిమా తెలుగులో లేదు. ఇలా అన్ని భాషల్లో ప్రయత్నించడం మంచిదే కానీ ఎక్కడో ఒక చోట స్థిరపడితే బెటర్ కదా అని అభిమానులు కోరుతున్నారు. అన్నట్టు రాశికి బాలీవుడ్ మీద కూడా కన్ను ఉందట. కాజల్ అగర్వాల్ ఇలియానా తమన్నా లాంటి వాళ్ళు అక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి తనకూ ఏదైనా మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉందట. ఐదేళ్ల క్రితమే పరిశ్రమకు వచ్చినా ఇప్పుడు జోరు పెంచిన రాశి ఖన్నా ఇకపై కూడా తెలుగు సినిమాల్లో కనిపించాలంటే మంచి ఆఫర్లు రావాలి. లేకపోతే తమిళ తంబీలు తనను వదిలేలా లేరు.