Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ లుక్ లో రాశీ కిల్లింగ్ ఫోజ్

By:  Tupaki Desk   |   19 Dec 2021 2:30 AM GMT
రెడ్ హాట్ లుక్ లో రాశీ కిల్లింగ్ ఫోజ్
X
టాలీవుడ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ కొన‌సాగిస్తున్న నాయిక‌గా రాశీ ఖ‌న్నా పేరు రికార్డుల్లో ఉంది. ఈ దిల్లీ బ్యూటీకి ఆశించిన‌న్ని బ్లాక్ బ‌స్ట‌ర్లు లేక‌పోయినా కెరీర్ బండిని తెలివిగా న‌డిపించేస్తోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో రాశిఖ‌న్నా కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులెడుతోంది. వ‌రుస‌గా త‌మిళ్ సినిమాల్లో న‌టిస్తూ ఎన్న‌డు లేనంత బిజీగా ఉంది. తెలుగులోనూ అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలొస్తున్నాయ్. ఇప్ప‌టికిప్పుడు షెడ్యూల్స్ ప‌రిశీలిస్తే.. రెండేళ్ల పాటు రాశీ డైరీ ఫుల్ అయింది. ఆన్ సెట్స్ లో కొన్ని సినిమాలుంటే.. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న‌వి మ‌రికొన్ని. వీటిలో ఎక్కువ‌గా కోలీవుడ్ సినిమాలే ఉన్నాయి.

ఇక రాశిఖ‌న్నా ఫోటో సెష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్పటి క‌ప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్ల‌తో కాక‌లు రేపుతుంది ఈ బ్యూటీ. విదేశీ ప్ర‌యాణాలు అయినా .. ర్యాంప్ వాక్ అయినా టెంప్టింగ్ లుక్ తో సంద‌డి చేస్తోంది. తాజాగా రాశీ రెడ్ హాట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది.

ఎరుపు రంగు బ్లౌజు.. ఎరుపు రంగు ప‌రికిణీలో రాశీ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. క్రిస్ట‌ల్స్ అద్దిన ఈ డిజైన‌ర్ డ్రెస్ త‌న కోస‌మే డిజైన్ చేశారా? అన్నంత ప‌ర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. నాభి అందాల‌తో రాశీ మైమ‌రిపిస్తుంది. గాలికి విర‌బూసిన కురులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను క‌లిగి ఉన్నాయి. టాప్ టూ బాట‌మ్ రెడ్ హాట్ లుక్ యూత్ ని అంతే ఇదిగా క‌వ్విస్తోంది. రాశీ కొంటె చూపులు చూప‌రుల‌ను మ‌రింత ఆక‌ట్టుకుంటున్నాయి. ఇది రాశీ న‌టిస్తున్న తాజా సినిమాలో సాంగ్ కి సంబంధించిన స్టిల్. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. రాశీ అభిమానులు కామెంట్ల‌తో మ‌రింత హీటెక్కిస్తున్నారు. ఇటీవ‌లే అమ్మ‌డు చీరలో రాశుల‌న్నింటిని దార‌బోసింది. ఆ ఘ‌డియ‌లు మ‌రువ‌క‌ ముందే ఇలా ఎరుపు వ‌ర్ణం బ్లౌజ్.. మ్యాచింగ్ తో మ‌రింత మ‌త్తులోకి జారుస్తుంది.

ఇక రాశీఖ‌న్నా సినిమాల విష‌యానికి వ‌స్తే.. గోపీచంద్ స‌ర‌స‌న `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్` చిత్రంలో న‌టిస్తోంది. దీనికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. వ‌చ్చే ఏడాది సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే అక్కినేని వార‌సుడు నాగ‌చైత్య స‌ర‌స‌న `థాంక్యూ ` చిత్రంలో న‌టిస్తోంది. విక్ర‌మ్.కె. కుమార్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. తెలుగులో రెండు సినిమాలు కోలీవుడ్ లో ఆరు సినిమాలు చేస్తోంది.