Begin typing your search above and press return to search.

ఈ పిల్ల రెప్పవాలనీయదు .. చూపు తిప్పనీయదు!

By:  Tupaki Desk   |   3 April 2021 11:30 PM GMT
ఈ పిల్ల రెప్పవాలనీయదు .. చూపు తిప్పనీయదు!
X
అసలైన అందం అంటే పదే పదే గుండెగోడపై మెరిసేది .. కలల రూపంలో కళ్లపైన విరిసేది. ఆ రూపాన్ని చూస్తుంటే .. ఆకలి ఉండదు .. దాహం దరిదాపుల్లోకి రాదు. కష్టాలు మరిచిపోవడానికి ఎలాంటి కౌన్సిలింగులు అవసరం లేదు .. అందమైన అమ్మాయి ఎదురుగా కూర్చుని ఒక నవ్వు పారేస్తే చాలు .. ఒక చూపు విసిరేస్తే చాలు. అందానికి దాసులుకాని వారు ఎవరు? .. ఆ అందం నీడను తాకి ధన్యులు కానివారు ఎవరు?

అందం చేసే గమ్మత్తు ఒకటి ఉంది .. అందం అందుబాటులోకి వస్తే అలకన అవుతుంది. అందుకోలేనిదైతే అద్భుతమవుతుంది. సలాములు కొట్టే అలాంటి సౌందర్యానికి శాంపిల్ గా రాశి ఖన్నా ఒక ఫొటో వదిలింది. ఈ ఫొటోలో ఆమె ఎల్లో రంగు డ్రెస్సులో ఎల్లోరా శిల్పంలా మనసు మైదానంలో మత్తుమందు జల్లుతోంది. ఈ మధ్యకాలంలో ఈ పిల్ల జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తోంది. ఆ కష్టం అంతా ఎక్కడికి పోతుంది? ఇదిగో ఇలా పనసతొన్నలా .. అచ్చమైన ఆవుపాల జున్నులా తయారైపోయింది.

'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ తరువాత తమిళ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టిన ఈ కొబ్బరిముక్కలాంటి అమ్మాయి, మళ్లీ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలను లైన్లో పెట్టేసుకుంటూ వెళుతోంది. అలా గోపీచంద్ సరసన .. రవితేజ జోడీగా అవకాశాలను దక్కించుకుంది. పిల్లకి గ్యాలన్ల కొద్దీ గ్లామర్ ఉంది కనుక, అవకాశాలు అవే వస్తాయి. కాకపోతే కథలో కాస్త కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి .. ఆ సినిమాలు విజయమనే వీధి మలుపు తిరగాలంతే!