Begin typing your search above and press return to search.

'రాశి' పోసిన అందాలను చూస్తే..తన్మయత్వమే!

By:  Tupaki Desk   |   17 Sep 2016 3:30 PM GMT
రాశి పోసిన అందాలను చూస్తే..తన్మయత్వమే!
X
అందాలను రాశి పోసి పేర్చినట్లుండే రాశి ఖన్నా.. ఢిల్లీ బ్యూటీనే అయినా టాలీవుడ్ కే అంకితం అయిపోయింది. అరంగేట్రం హిందీ సినిమాతోనే అయినా.. మళ్లీ అటు వైపు చూడను కూడా చూడలేదు. వరుసగా ఇక్కడే సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ ని ఏలేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. కేరక్టర్ల ఎంపిక విషయంలో ఈమె ట్యాలెంట్ ని పొగడాల్సిందే. తనకు తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడే పాత్రలతో అభిమాన గణాన్ని పెంచుకుంటోంది.

అన్నీ బాగానే ఉన్నా.. అమ్మడి పర్సనాలిటీ విషయంలో కాసిన్ని విమర్శలు వస్తుంటాయి. వాటికి సమాధానం చెప్పడానికా అన్నట్లుగా ఇప్పుడు ఓ ఫోటో షూట్ చేసింది రాశి ఖన్నా. ఏ రేంజ్ లో తనను తాను మౌల్డ్ చేసుకుందో.. విమర్శలకు సమాధానం చెప్పేందుకు అమ్మడు ఎంత హార్డ్ వర్క్ చేసిందో.. ఈ ఫోటోలు చూస్తే అర్ధమైపోతుంది. ఏ యాంగిల్ నుంచి చూసినా మెరిసిపోయేలా.. నిగనిగలాడుతున్న అమ్మడి అందాలు అభిమానులకు కనువిందు చేయడం ఖాయం. పైగా.. తన స్కిన్ టోన్ కి దగ్గరగా ఉండే ఉల్లిపొర లాంటి డ్రసింగ్.. సోయగాలను చూపిస్తూ ఊరించేస్తోంది.

ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి ఆక్సిజన్ లో నటిస్తున్న ఈ భామ.. మాస్ మహరాజ్ రవితేజతో రెండో సినిమాకి రెడీ అయిపోతోంది.