Begin typing your search above and press return to search.

కొత్తందాల్ని త‌ట్టుకోలేక స‌ర్దేయాల్సిందే రాశీ

By:  Tupaki Desk   |   8 Jun 2020 1:01 PM GMT
కొత్తందాల్ని త‌ట్టుకోలేక స‌ర్దేయాల్సిందే రాశీ
X
ఇండ‌స్ట్రీలోకి కొత్త నీరు వ‌చ్చి పాత నీరు వెళ్లిపోతుంటుంది. హీరోల విష‌యంలో మైలేజ్ వేరేగా ఉంటుంది కానీ హీరోయిన్లు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లే వాళ్లే ఎక్కువ‌. ఎప్ప‌టిక‌ప్పుడు యూత్ కొత్త గ్లామ‌ర్ ని ప‌రిచ‌యం చేయాల‌ని కోరుకుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే మ‌న ద‌ర్శ‌క‌హీరోలు ఆ ప్ర‌య‌త్న‌మే చేస్తుంటారు.ఇక ఇటీవ‌లి కాలంలో ఇరుగు పొరుగు మెట్రో న‌గ‌రాల నుంచి అంద‌గ‌త్తెల వెల్లువ మామూలుగా లేదు. ముంబై .. చెన్న‌య్ .. బెంగ‌ళూరు.. మంగులూరు.. దిల్లీ... పూణే.. ఇలా అన్నిచోట్ల నుంచి మోడ‌ల్స్ వెల్లువెత్తుతున్నారు.

వీళ్ల‌లో ప్ర‌తిభావంతులైన భామ‌ల‌కు వ‌రుస‌గా అవ‌కాశాలొస్తున్నాయి. అయితే ఇలా కొత్తందాలు పుట్టుకురావ‌డం అప్ప‌టికే సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్న మీడియం రేంజ్ భామ‌ల‌కు ఇబ్బందిక‌రంగానే మారుతోంది. మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స్టార్ రేంజ్ నాయిక‌ల‌కు ప‌దే ప‌దే అవ‌కాశాలిస్తున్నా మీడియం రేంజ్ నాయిక‌ల్ని మాత్రం ప‌ట్టించుకునేది త‌క్కువే. కొత్త భామ‌ల ఎంపిక‌కే ప్రాధాన్య‌త‌నిస్తుండ‌డం వ‌ల్ల వీళ్ల‌కు ఇబ్బంది త‌ప్ప‌డం లేదు.

ఆ కోవ‌లోనే అందాల రాశీ ఖ‌న్నా ఇక ఖాళీ చేయాల్సిన టైమ్ వ‌చ్చింద‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఇంక సినిమాలు అయిపోయే స్టేజ్ కి వ‌చ్చేసింది క‌దా...! అందుకే రాశీ త‌న‌లోని ఇత‌ర క్వాలిటీస్ పైనా శ్ర‌ద్ధ పెట్టాల్సి ఉంటుందేమో! ఇక‌పై గాయ‌నిగా మారి పాట‌లు పాడుకోవ‌డ‌మే బెస్ట్ అని యాంటీ ఫ్యాన్స్ రాశీ ఖ‌న్నా మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక‌పై ఇండ‌స్ట్రీలో పోటీని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. మీడియం రేంజ్ హీరోలు ఎలాగు ఛాన్సులు ఇవ్వ‌రు. స్టార్ హీరోలకు సూట్ కాదు. అందుకే ఇలా అంద‌మైన సింగ‌ర్ గా మారిపోవ‌డ‌మో లేక క‌న్న‌డ మ‌ళ‌యాలం అంటూ వేరే భాష‌ల్లోకి వెళ్లిపోతే బెట‌ర్ అనేది కొంద‌రు సీనియ‌ర్ కాస్టింగ్ డైరెక్ట‌ర్స్ స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి రాశీ ఏమంటుందో చూడాలి.