Begin typing your search above and press return to search.

మాస్ మంత్రం జపిస్తున్న అందాల మందారం!

By:  Tupaki Desk   |   29 March 2021 8:30 AM GMT
మాస్ మంత్రం జపిస్తున్న అందాల మందారం!
X
ఆకర్షించడం అందం లక్షణం .. కుర్రాళ్ల చూపులను వాకిట్లో కట్టేయడం దాని నైజం. అలాంటి అందానికి వయసులో ఉన్నవాళ్లంతా అభిమానులైపోతూనే ఉంటారు .. ఆరాధకులై ఊహల ఉద్యానవనంలో అలసిపోతూనే ఉంటారు. అలా కుర్రాళ్ల గుండెలను గాడిపొయ్యిలా మార్చేసిన ముద్దమందారం లాంటి కథానాయికగా రాశి ఖన్నా కనిపిస్తుంది. కలకండలాంటి ఈ పిల్లను చూసిన తరువాత వాళ్ల కనురెప్పలు వాలలేదు. ఆమె సొగసుల సరస్సులో మునిగిపోయిన మనసులు ఇంతవరకూ తేలలేదు. అలా చందమామలాంటి ఈ అమ్మాయి వెండితెరపై వెన్నెల వెదజల్లుతూ వెళుతోంది.

మొదటి నుంచి కూడా రాశి ఖన్నా అవకాశాల కోసం హైరానా పడిపోయినట్టు కనిపించదు. పరుగుపందెంలో తానున్నాననే విషయాన్ని పట్టించుకున్నట్టుగా అనిపించదు. అన్ని అందాలను అప్పుడే ఖర్చు చేయకూడదని అనుకున్నట్టుగా కొసరు అందాలను మాత్రమే వడ్డిస్తూ వస్తోంది. రాశి ఖన్నాకు యాక్టింగ్ కూడా వచ్చు .. కామెడీ కూడా బాగానే చేస్తుంది. అసలు ఆమె ఏమీ చేయవద్దు .. తెరపై తెల్ల గులాబీల కనిపిస్తే చాలు అనేది కుర్రాళ్ల మాట. పాటల్లో పారిజాతంలా మెరిస్తే చాలు .. అదే పదివేలు అనేది వాళ్ల అభిప్రాయం. అలాంటి రాశి ఖన్నా ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక తెలుగులో మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తోంది. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్ ను బట్టే ఇది మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతోన్న సినిమా అని తెలుస్తోంది. రాశి ఖన్నా గ్లామర్ కి మాస్ కోటింగ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆమె మరో మాస్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. నక్కిన త్రినాథరావు .. రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ కంటెంట్ తో రూపొందనున్న ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం రాశి ఖన్నాను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. చూస్తుంటే కొబ్బరిముక్కలాంటి ఈ పిల్ల మాస్ కథల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తోంది.