Begin typing your search above and press return to search.

క‌వ్వించి హ‌త్య‌లు చేసే కి`లేడీ` పాత్ర‌లో..?

By:  Tupaki Desk   |   26 March 2021 9:30 AM GMT
క‌వ్వించి హ‌త్య‌లు చేసే కి`లేడీ` పాత్ర‌లో..?
X
మ‌త్తు క‌ళ్ల‌తో చిత్తు చేయ‌డం కొంద‌రికి హ్యాబిట్. ఈ విష‌యంలో ఆరితేరిపోయిన ఈ బ్యూటీ ఎవ‌రో ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అందాల రాశీ ఖ‌న్నా కిల్లింగ్ ఫోటోషూట్లు యువ‌త‌రంలోకి సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఆర‌బోత‌లో రాశీ ఎక్క‌డా త‌గ్గ‌క‌పోవ‌డంతో.. ఓ రేంజులోనే వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ తో అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చింది రాశీ. ఈ ఫోటోల‌కు ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ``మరో రోజు. మరొక హత్య.. *క్స్!`` అంటూ మ‌త్తు క‌ళ్ల‌తో అగ్గి రాజేసింది. #BetweenTheShots పేరుతో షేర్ చేసిన ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. రాశీ ప్ర‌స్తుతం ఫ్యామిలీ మ్యాన్ ద‌ర్శ‌కులు రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న తాజా వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఈ సిరీస్ లో రాశీ కిల్ల‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంద‌ని త‌ను ఇచ్చిన హింట్ ని బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇత‌ర‌ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... రాశి ఖన్నా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. తుగ్లక్ దర్బార్- అరణ్మ‌నై 3- మేథావి లాంటి త‌మిళ చిత్రాలు స‌హా మలయాళంలో భ్రమం అనే చిత్రంలో న‌టించింది. తెలుగులో గోపిచంద్ తో పక్కా కమర్షియల్ చిత్రంలో న‌టిస్తోంది.