Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లుక్ తో షేక్ చేసిన రాశీ

By:  Tupaki Desk   |   20 March 2021 2:50 PM GMT
ఫోటో స్టోరి: నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లుక్ తో షేక్ చేసిన రాశీ
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన రాశీఖ‌న్నా ఇటీవ‌ల పొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌పై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. వెంకీ మామ‌- ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్నా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ నిరాశ‌ప‌రిచడంతో రాశీ నిరాశ‌కు లోనైంది. ప్ర‌స్తుతానికి ఇక్క‌డ ఆఫ‌ర్లు నిల్. ఆ క్ర‌మంలోనే ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. కోలీవుడ్ లో ఏకంగా నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ మ‌ల‌యాళంలోనూ రంగ ప్ర‌వేశం చేస్తోంది. ఇటీవ‌ల మాలీవుడ్ లో ఓ సినిమాకి సంత‌కం చేసింది.

ఇక పొరుగు భాష‌ల్లో పెద్ద కెరీర్ ఆశిస్తున్న రాశీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోనూ జ‌రంత స్పీడ్ గా ఉంటోంది. ఇన్ స్టా మాధ్య‌మంలో నిరంత‌రం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో రాశీ ఖ‌న్నా వేడి పెంచుతోంది.

తాజాగా ఇన్ స్టా వేదిక‌గా ఓ హాట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. రాశీ నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లుక్ లో ప్ర‌త్య‌క్ష‌మై అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. ఎల్లో డిజైన‌ర్ సూట్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తూనే ఇన్న‌ర్ అందాల ఎలివేష‌న్ తో ఈ అందాల భామ‌ వేడెక్కించింది. అందం ఒకేచోట రాశి పోసిన‌ట్టుగా ఉంద‌ని.. ఇంత‌కుముందెన్న‌డూ ఈ దిల్లీ బ్యూటీ ఇంతగా విరుచుకుప‌డ‌లేద‌ని ఫ్యాన్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రాశీ ఉన్న‌ట్టుండి హాట్ ఫోటోషూట్ల‌తో సునామీలా విరుచుకుప‌డుతోంది అంటూ అభిమానులు కామెంట్ల‌ను గుప్పిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌మిళంలో సైతాన్ కా బ‌చ్చా రిలీజ్ కి రావాల్సి ఉంది. ఆర‌ణ్మ‌యి 3- తుగ్ల‌క్ ద‌ర్బార్- మేధావి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. భ్ర‌మం అనే మ‌ల‌యాళ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ క‌ర్త‌లు రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ స‌ర‌స‌న రాశీ న‌టించ‌నుంది.