Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న రాశిఖన్నా స్పెషల్ ట్రీట్..!

By:  Tupaki Desk   |   8 March 2021 10:15 AM GMT
వైరల్ అవుతున్న రాశిఖన్నా స్పెషల్ ట్రీట్..!
X
అందమైన ముద్దుగుమ్మలు మరింత అందంగా ఎప్పుడు కనిపిస్తారు అంటే ఏ గ్లామర్ డ్రెస్ వేసినప్పుడో కాదు. చక్కటి పద్ధతి కలిగిన పల్లెటూరు అమ్మాయిగా ముస్తాబు అయినప్పుడే అందమైన భామలు కూడా పచ్చని సెరికల్లో తిరిగే సీతాకోకచిలుకలుగా కనిపిస్తారు. అందులోను సినిమా హీరోయిన్స్ అంటే కుర్రాళ్లు పడిచస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన భామలు చాలానే ఉన్నారు. వారిలో ఒకరు సొట్టబుగ్గల వయ్యారి రాశిఖన్నా. తాజాగా విమెన్స్ డే సందర్బంగా అమ్మడు పక్కా పల్లెటూరు పడుచులా తయారయ్యింది. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత సర్ప్రైజ్ చేసింది. అసలే రాశికి ఫ్యాన్ ఫాలోయింగ్ అందులోను ఎప్పుడెప్పుడు ఎదురుపడుతుందా అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్.

మరి చక్కగా లంగావోణీ ధరించి ఇలా అందంగా ఎదురుపడితే ఎవరు ఊరుకుంటారు.. అలా కళ్ళప్పగించి చూస్తున్నారంతే. రాశి మహిళా దినోత్సవం సందర్బంగా అందరికి ఏదో చెప్పాలని అనుకుంది. అందుకే చేతితో నేసిన కోటా ఫాబ్రిక్ డ్రెస్ ధరించింది. అలాగే నేసిన దుపట్టా కూడా జతచేసింది. రాశి అందమైన చేతులకు ఆకుపచ్చని గాజులు, నుదుటి పై ధృవతిలకం, ఆ కొప్పున బంతిపూలు అమ్మడికి పరిపూర్ణ పల్లెపడుచు రూపాన్ని తీసుకొచ్చాయి. చూస్తుంటే నేసిన కోటా ఫాబ్రిక్ డ్రెస్సులకు రాశి మద్దతుగా నిలుస్తున్నట్లు అనిపిస్తుంది. వీటితో పాటు.. 'ప్రతి రాత్రి మట్టినేలపై తలవాల్చి, ఆరోజు అనుభవాలను భూతల్లితో పంచుకుంటుంది. తన కళ్ళలో మరణం తదేకంగా చూస్తే తప్ప ఎవ్వరూ స్త్రీని ఓడించలేరని.. ఎన్ని ఉన్నా మహిళ మనసులో మర్మాన్ని ఎవరూ గుర్తించలేరు' అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది రాశి. ప్రస్తుతం విమెన్స్ డే సందర్బంగా రాశి పోస్ట్ చేసిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.