Begin typing your search above and press return to search.

ప్యారిస్ ఫ్యాష‌నిస్టాలైనా రాశీకి త‌ల వంచాలి!

By:  Tupaki Desk   |   19 Oct 2021 11:30 AM GMT
ప్యారిస్ ఫ్యాష‌నిస్టాలైనా రాశీకి త‌ల వంచాలి!
X
ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న రాశీ ఖ‌న్నా మ‌రో వైపు సోష‌ల్ మీడియాల్లోనూ అంతే జోరుగా ఉంది. ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో ట్రెండింగ్ గా మారుతోంది. ఇక ఫోటోషూట్లలో రాశీ ప్ర‌యోగాలు యువ‌త‌రంలో డిబేట్ కి తెర తీస్తున్నాయి. డ్రెస్సింగ్ సెన్స్ ప‌రంగా యూనిక్ స్టైల్ తో రాశీ అద‌ర‌గొడుతోంది.

తాజాగా త‌న‌లోని వెర్స‌టైలిటీ గురించి డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి రాశీ ఇలా ఫోటోల రూపంలో వివ‌ర‌ణ ఇచ్చింది. ఆమె ఏదైనా ఒక డ్రెస్ ని ఎంపిక చేయాలంటే చాలా ప్ర‌యోగాలు చేస్తుంది. స్టైలిస్ట్ లు చాలా ఆలోచనలతో దుస్తుల్ని డిజైన్ చేస్తారు. ఒకదాన్ని ఎంచుకునే ముందు ఆమె ర‌క‌ర‌కాల‌ దుస్తులను ప్రయత్నిస్తుంది. సాధారణ దుస్తుల ట్రయల్స్ ని పరిశీలించిన క్ర‌మంలో ఇదిగో ఇలా కొన్ని ఫోటోల‌ను పోస్ట్ చేసింది. క‌ళ్లు తిప్పుకోనివ్వ‌నంత‌ అందంగా హాట్ గా కనిపిస్తోంది రాశీ.

``మేం ఎలాంటి గందరగోళాన్ని సృష్టిస్తున్నామో చూడండి ... నేను నా దుస్తుల ట్రయల్స్ స్పష్టంగా కనిపిస్తుంది.. నా ముఖంలోనూ అది స్ప‌ష్టంగా తెలుస్తుంది`` అని ఆమె రాసింది.

ప్ర‌స్తుతం రాశీఖ‌న్న గోపీచంద్ స‌ర‌స‌న `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్` చిత్రంలో న‌టిస్తోంది. దీనికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. అక్టోబ‌ర్ లో సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే అక్కినేని వార‌సుడు నాగ‌చైత్య స‌ర‌స‌న `థాంక్యూ ` చిత్రంలో న‌టిస్తోంది. విక్ర‌మ్. కె. కుమార్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. తెలుగు లో ఈ రెండు మిన‌హా కోలీవుడ్ లో ఆరు చిత్రాల్లో న‌టిస్తుంది