Begin typing your search above and press return to search.

మళయాళంలో మెప్పించి.. తమిళంలోకి ఎంట్రీ

By:  Tupaki Desk   |   30 Nov 2017 9:56 AM IST
మళయాళంలో మెప్పించి.. తమిళంలోకి ఎంట్రీ
X
టాలీవుడ్ లో కొత్తగా అడుగు పెట్టే హీరోయిన్లలో చాలామంది కేరళ కుట్టీలే ఉంటున్నారు. అప్పట్లో వచ్చిన నయనతార నుంచి ఈ మధ్య వచ్చిన అనుపమ పరమేశ్వరన్ వరకు అందరూ అక్కడి నుంచి ఇక్కడకు వచ్చి పేరు తెచ్చుకున్న వారే. వీళ్లందరికీ డిఫరెంట్ గా తెలుగులో పాపులరయ్యాక మళయాళంలో అడుగుపెట్టి అక్కడ శభాష్ అనిపించుకుంది ముద్దుగుమ్మ రాశీఖన్నా.

మాతృభాష కాకపోయినా తెలుగులో గొంతు సవరించుకుని పాట కూడా పాడగలగేంత రేంజిలో ఇక్కడ పేరు తెచ్చుకుంది రాశీఖన్నా. మళయాళ టాప్ హీరోల్లో ఒకరైన మోహన్ లాల్ హీరోగా నటించిన విలన్ సినిమాతో అక్కడ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో రాశీ నటనకు మంచి పేరే వచ్చింది. ఇదే టైంలో తమిళంలో పేరు తెచ్చుకోవానలని రాశీ ఆశ పడుతోంది. జయం రవి హీరోగా నటించే సినిమా ద్వారా కోలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. ‘‘రాశీఖన్నా ఇంతవరకు చేయని పాత్రను ఈ సినిమాలో చేయబోతోంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె రోల్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఆమెకు ఈ పాత్ర బాగా నచ్చింది. దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్ మెంట్ త్వరలోనే వస్తుందని’’ చిత్ర యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటికే జైలవకుశ సినిమాతో ఓ హిట్ ఖాతాలో వేసుకున్న రాశీ ఖన్నా తాజాగా ఆక్సిజన్ సినిమాలో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. రవితేజ హీరోగా నటించిన టచ్ చేసి చూడు.. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలిప్రేమ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది రిలీజయ్యే ఈ రెండు సినిమాలకూ దర్శకులు కొత్తవాళ్లే.