Begin typing your search above and press return to search.

ఈ నాజూకు సుందరి స్విమ్ సూట్ వేసినా ఆహా అనాల్సిందే!

By:  Tupaki Desk   |   12 Feb 2021 9:09 AM GMT
ఈ నాజూకు సుందరి స్విమ్ సూట్ వేసినా ఆహా అనాల్సిందే!
X
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్లుగా తన అందం అభినయంతో తెలుగు కుర్రకారుకు మతులు పోగొడుతోంది. ఫస్ట్ మూవీ ఊహలు గుసగుసలాడే దగ్గర నుండి వెంకీమామ వరకు స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తూనే ఉంది. బెంగాల్ టైగర్ సినిమా నుండి గ్లామర్ షో ప్రారంభించింది రాశి. ఈ ఢిల్లీ వయ్యారి అందాలతో గ్లామర్ ప్రపంచంపై నిరంతర దండయాత్ర చేస్తోంది. వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. రాశి కెరీర్లో జిల్, తొలిప్రేమ, సుప్రీమ్, ప్రతిరోజూ పండగే హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అమ్మడు చివరిగా వెంకీమామ, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలలో కనిపించింది. అయితే సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో చిచ్చు రేపుతోంది భామ.

ఆ మధ్యలో కాస్త లావుగా కనిపించింది కానీ మళ్లీ వర్కౌట్స్ చేసి నాజూకుగా తయారయ్యింది. అలాగే ఎప్పటికప్పుడు తన నాజూకు ఒంపుసొంపులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఊరిస్తోంది. ఎవరు ఏమైపోయినా రాశి మాత్రం తన గ్లామర్ షోతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తానంటోంది. అందుకే తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద స్విమ్ సూట్ ధరించిన పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మరి అసలే అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఊరుకుంటారా! స్విమ్ సూట్ లో ఏకంగా బికినీ వేసినంతగా కిక్ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజంగా బ్లాక్ స్విమ్ సూట్ లో మొత్తంగా మురిపిస్తోంది రాశి. సొట్టబుగ్గల సుందరి స్విమ్ సూట్లో మరింత రెట్టింపు అందంతో నిగనిగలాడుతుంది. మొత్తానికి రాశి బికినీలో కాకపోయినా ఆ రేంజిలో ఎంటర్టైన్ చేస్తోందని ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతోంది.