Begin typing your search above and press return to search.

రాశిని ఎవరు ఆదుకుంటారో

By:  Tupaki Desk   |   28 Jan 2018 4:13 AM GMT
రాశిని ఎవరు ఆదుకుంటారో
X
బబ్లీ బ్యూటి రాశి ఖన్నా కెరీర్లో పెద్ద హిట్‌లు లేక‌పోయినా... సినిమా అవ‌కాశాలు మాత్రం వ‌రుస‌గా వ‌చ్చాయి. చిన్న హీరోలు - పెద్ద హీరోలు తేడా లేకుండా సినిమాలు చేసేసింది అమ్మ‌డు. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేక‌పోయింది. ఇప్ప‌డు ఆమె కెరియ‌ర్‌ను రెండే సినిమాలు నిర్ణ‌యించ‌బోతున్నాయి.

ప్ర‌స్తుతం రాశి ర‌వితేజ‌తో ట‌చ్ చేసి చూడు, వ‌రుణ్ తేజ్‌తో తొలిప్రేమ సినిమాల్లో న‌టిస్తోంది. ఆ రెండు సినిమాల్లో రెండు డిఫ‌రెంట్ రోల్స్ చేస్తోంది. వారం రోజుల తేడాతో ఈ రెండు సినిమాలు విడుద‌ల‌వ్వ‌బోతున్నాయ్‌. ట‌చ్ చేసి చూడు ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే రాశి అందాలు ఆర‌బోసిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. టూ పీస్ డ్రెస్సుతో - లిప్ లాక్‌ లో రెచ్చిపోయింది. అదే తొలిప్రేమ విష‌యానికి వ‌స్తే మాత్రం... ఆమె చాలా ప‌ద్ద‌తిగా, ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా న‌టించిన‌ట్టు టాక్. తొలిప్రేమ సినిమాలో ఆమె బాగా న‌టించిన‌ట్టు ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలో టాక్‌. ఈ రెండు సినిమాల‌లో ఒక్క సినిమా హిట్ అయినా కూడా రాశి ద‌శ తిరిగిపోతుంది. స్టార్ హీరోయిన్‌ గా మారిపోతుంది.

ఇంత‌వ‌ర‌కు రాశి చేసిన సినిమాల‌లో ఆమెకు పేరు తెచ్చిన పాత్ర‌లు ఏవీ లేవు. ఈ రెండు సినిమాలైనా ఆమె జీవితంలో మ‌రిచిపోలేని విజ‌యాన్ని ఇస్తాయేమో చూడాలి. ఈ రెండూ సినిమాలు కూడా స‌రిగా ఆడ‌క‌పోతే... రాశి కెరీర్‌ కు కాస్త ఇబ్బందే అని అంచ‌నా వేస్తున్నారు సినీ జ‌నాలు.