Begin typing your search above and press return to search.

రాశి మెచ్యూర్డ్ హీరోయిన్ అయింది

By:  Tupaki Desk   |   23 July 2018 6:48 AM GMT
రాశి మెచ్యూర్డ్ హీరోయిన్ అయింది
X
న‌ట‌న విష‌యంలో రాశిఖ‌న్నా ఏంటో ఆమె తెలుగులో చేసిన తొలి సినిమాతోనే తెలిసిపోయింది. `ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె అందులోనే మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. తెలుగు భాష కొత్త‌యినా అందులోని పాత్ర‌లో ఒదిగిపోయింది. కానీ అది పెద్ద హీరో సినిమా కాక‌పోవ‌డంతో రాశి గురించి పెద్ద‌గా మాట్లాడుకోలేదు. అయితే ఆ త‌ర్వాత నుంచి ఆమెని అంతా బ‌బ్లీ భామ‌గానే చూస్తూ - అలాంటి పాత్ర‌లే క‌ట్ట‌బెట్టారు. దాంతో రాశి ప్ర‌తిభ మ‌రుగున ప‌డిపోయింది. కానీ రాశిలో ఎంత మంచి న‌టి ఉంద‌నే విష‌యం మొన్న విడుద‌లైన `తొలిప్రేమ‌` త‌ర్వాతే తెలిసింది. అందులో ఆమె మూడు కోణాల్లో సాగే పాత్ర‌లో ఒదిగిపోయిన విధానం అల‌రించింది.

రాశిలో న‌టి ఇంత ప‌రిణ‌తి సాధించిందా అని మాట్లాడుకొన్నారు. అందుకే ఇప్పుడంతా ఆమెని మెచ్యూర్డ్ హీరోయిన్‌ గానే చూస్తున్నారు. అయితే ఎంత మంచి న‌ట‌న క‌న‌బ‌రిచినా - ఎంత మంచి స‌క్సెస్ వ‌చ్చినా `తొలిప్రేమ‌` త‌ర్వాత రాశిఖ‌న్నాని పెద్ద‌గా అవ‌కాశాలు వ‌రించ‌లేదు. `శ్రీనివాస‌క‌ళ్యాణం` సినిమాని కూడా త‌న మేనేజ‌ర్ల‌ని దిల్‌ రాజు ఆఫీసులో కూర్చోబెట్టి మ‌రీ సంపాదించుకుంద‌ట‌. ఆ విష‌యాన్ని దిల్‌ రాజు స్వ‌యంగా చెప్పాడు. అంటే స‌క్సెస్ వ‌చ్చినా ఆమెకి అవ‌కాశం మాత్రం ఈజీగా రాలేద‌న్న‌మాట‌. అయితే `శ్రీనివాస‌క‌ళ్యాణం`లో మాత్రం రాశి పాత్ర - ఆమె స‌న్నివేశాలు మ‌రింత బాగా పండాయ‌ట‌. ఆ విష‌యాన్ని చిత్ర‌బృందం ప్ర‌త్యేకంగా నొక్కి చెబుతోంది. అలాగే నిన్న విడుద‌లైన శ్రీనివాస‌క‌ళ్యాణం టీజ‌ర్ కూడా ఆ విష‌యాన్నే స్ప‌ష్టం చేస్తోంది. అందులో అబ్బాయిల‌కే కాదు ముద్దొచ్చేది అంటూ రాశి చెప్పిన విధానం - ఆ స‌న్నివేశాల్లో ఆమె హావ‌భావాలు చూడముచ్చ‌ట‌గా ఉన్నాయి. మ‌రి ఈ చిత్రం త‌ర్వాత ఈ దిల్లీ భామ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చూడాలి.