Begin typing your search above and press return to search.

సమంతలా ఫోజులు సరిపోతాయా రాశి?

By:  Tupaki Desk   |   21 Sep 2016 7:30 AM GMT
సమంతలా ఫోజులు సరిపోతాయా రాశి?
X
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనే స్లాట్స్ ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత ఓ గ్యాప్ క్రియేట్ చేస్తోందనే విషయం అర్ధమైంది. అనుష్క అన్ని సినిమాలు చేయలేకపోవడం.. నయన్ అందరికీ అందుబాటులో లేకపోవడం.. కాజల్ రేసులో వెనకబడ్డం లాంటి సిట్యుయేషన్ ప్రస్తుతం ఉంది. అయితే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్లేస్ కోసం.. పోటీ పడుతున్న వారిలో రాశి ఖన్నా కూడా ఉంది. ఈ భామ సమంత పొజిషన్ ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి రాశి ఖన్నా నటించిన హైపర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నెల 30న రిలీజ్ కి షెడ్యూల్ చేసిన హైపర్ కు.. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలైపోయాయి. ఇందులో భాగంగా కొత్త కొత్త పోస్టర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ పోస్టర్ లో రాశి ఖన్నా పోజ్ చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. జనతా గ్యారేజ్ మూవీ యాపిల్ బ్యూటీ సాంగ్ లో సమంత ఎలా అయితే.. రెండు చేతులు పైకి ఎత్తి.. నడుం ఒంపులు చూపిస్తూ.. ఓ కాలు ముందుకు నెట్టి స్టెప్ వేసిందో.. అదే టైపు పోజులో రాశి కనిపిస్తోంది.

సమంత రేంజ్ కి ఎదగాలంటే కేవలం పాటల్లో పోజులు కాపీ కొట్టేస్తే సరిపోతుందా అన్నది అసలు పాయింట్. తను తప్పుకుంటోంది కాబట్టి.. ఆ స్లాట్ కు గురి పెట్టడంలో తప్పు లేదు కానీ.. ఇంకా చాలా యాంగిల్స్ లో ఇంప్రూవ్ అయితేనే.. ఆ స్థాయిని అందుకోవడం సాధ్యమవుతుంది. మరి ఈ విషయాన్ని రాశి ఖన్నా క్యాచ్ చేస్తుందా!.