Begin typing your search above and press return to search.

అందాలతో దాడి చేసిన రాశీఖ‌న్నా

By:  Tupaki Desk   |   10 Oct 2021 12:30 AM GMT
అందాలతో దాడి చేసిన రాశీఖ‌న్నా
X
ఢిల్లీ బ్యూటీ రాశిఖ‌న్నా కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులెడుతోంది. వ‌రుస‌గా తెలుగు..త‌మిళ్ సినిమాల్లో న‌టిస్తూ ఎన్న‌డు లేనంత బిజీగా ఉంది. రెండేళ్ల డైరీ ఫుల్ అయింది. ఆన్ సెట్స్ లో కొన్ని సినిమాలుంటే.షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న‌వి మ‌రికొన్ని. వీటిలో ఎక్కువ‌గా కోలీవుడ్ సినిమాలే ఉన్నాయి. ఇక రాశిఖ‌న్నా ఫోటో సెష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్పటి క‌ప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్ల‌తో అమ్మ‌డు కాక‌లు రేపుతుంది. విదేశీ ట్రిప్ కి సంబంధించిన‌వైనా..టెంప్టింగ్ ఫోటోలైనా సరే ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాల్సిందే. వాటిపై కామెంట్ల‌తో హీటెక్కాల్సిందే.

తాజాగా రాశీఖ‌న్నా హాట్ ఫోటో ఒక‌టి వైర‌ల్ గా మారింది. ఈ ఫోటో సెష‌న్ లో దాదాపు అమ్మ‌డు టాప్ ఓపెన్ చేసినంత ప‌నిచేసింది. ఇన్న‌ర్ అందాల్ని ఓపెన్ గా వ‌దిలేసి ఓ ష‌ర్టు ధ‌రించింది. మునుపెన్న‌డు ఇలాంటి హాట్ ఫోటో సెష‌న్లో అమ్మ‌డు పొల్గొన‌లేదు. తొలిసారి ఇంత హాట్ గా అందాల్ని ఫ్రీగా వ‌దిలేయ‌డం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాశంగా మారింది. ఉన్న‌ట్లుండి రాశీలో ఈ మార్పులేంటి? అంటూ ఆమె ఫాలోవ‌ర్స్ అడుగుతున్నారు. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఫోటో మాత్రం ఇన్ స్టాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

ప్ర‌స్తుతం రాశీఖ‌న్న గోపీచంద్ స‌ర‌స‌న `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్` చిత్రంలో న‌టిస్తోంది. దీనికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. అక్టోబ‌ర్ లో సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే అక్కినేని వార‌సుడు నాగ‌చైత్య స‌ర‌స‌న `థాంక్యూ ` చిత్రంలో న‌టిస్తోంది. విక్ర‌మ్. కె. కుమార్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. తెలుగు లో ఈ రెండు మిన‌హా ఆరు చిత్రాలు కోలీవుడ్ లో న‌టిస్తుంది.