Begin typing your search above and press return to search.

బ్యాక్ లెస్ రాశి అందాలను పట్టించుకోరే

By:  Tupaki Desk   |   26 Jan 2016 11:30 AM GMT
బ్యాక్ లెస్ రాశి అందాలను పట్టించుకోరే
X
అవార్డుల పండుగ అంటే అందాల విందు అని మరో అర్ధం కూడా చెప్పేసుకోవచ్చు. తెర మీద వయ్యారాలు ఒలకబోసే ముద్దుగుమ్మలు, తమ సొగసులను ఆఫ్ స్క్రీన్ లో నూ ప్రదర్శించే అద్భుతమైన సంబరం ఇది. దక్షిణాది తారలు మొత్తం ఐఫా వేడుకల కోసం హైద్రాబాద్ కి దిగి వచ్చేసి.. అందాలను కుమ్మరించేశారు. ఎటు చూసిన బ్యూటీలే ఉండడంతో.. ఎటు చూడాలో ఎవరిని చూడాలో అర్ధం కాని పరిస్థితి. నేరుగానే కాదు.. టీవీల్లో చూస్తున్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సోయగత్తెలు సొగసులను పారబోస్తుంటే.. కళ్లప్పగించి ఏరుకోవాల్సిన పరిస్థితి ప్రేక్షకులకు వచ్చింది.

ఇంతమంది ఒకేసారి వయ్యారాలు కురిపించడంతో.. పాపం రాశిఖన్నాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ భామ బ్లాక్ కలర్ డ్రెస్ తో కళ్లు తిరిగిపోయేలా అందాలను ప్రదర్శించింది. ముందు వైపు క్లీవేజ్, వెనక్కి తిరిగితే బ్యాక్ లెస్ డ్రస్సుతో అలరించింది. ఎటు తిరిగి చూసినా, ఎటునుంచి చూసినా మెరిసిపోతూ కనిపించింది. గతంతో పోల్చితే ఇప్పుడు బాగా చిక్కింది కూడా. మరి ఇలా సన్నబడ్డం ఎందుకో తెలీదు కానీ.. చక్కనమ్మ చిక్కినా అందమే అనడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది రాశి ఖన్నా.

గ్లామర్ మెరుపుల్లో తాను ఏమాత్రం తగ్గనని, ఎవరికీ తీసిపోనని ఇన్ డైరెక్టుగా కాదు.. డైరెక్టుగానే డైరెక్టర్లకు చెప్పేసింది రాశిఖన్నా. మరి ఇలాంటి గెటప్పులో రాశి ఖన్నాను చూశాక.. ఇకపై ఆన్ స్క్రీన్ పైనా ఇంతకంటే అందంగా కనిపిస్తుందనే విషయం అందరికీ అర్ధమయిపోయింది. సో ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఫర్ రాశి ఖన్నా బ్యూటీస్.