Begin typing your search above and press return to search.

అగ్గి రాజేసిన నాజూకు న‌డుమందం!

By:  Tupaki Desk   |   5 March 2020 4:50 AM GMT
అగ్గి రాజేసిన నాజూకు న‌డుమందం!
X
రాశీఖన్నా అంటే గ్లామర్‌ డాల్‌ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అనేది తరచూ వినిపించేది. ఎందుకంటే ఆమె చాలా వరకు గ్లామరస్‌ పాత్రలతోనే ఆకట్టుకుంది. కమర్షియల్‌ హీరోయిన్ గానే రాణించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ఇప్పటి వరకు కమర్షియల్‌ పాత్రలతో పాటు అడపాదడపా డిఫరెంట్‌ రోల్స్ కూడా చేసేందుకు ట్రై చేసింది. కానీ అవి ఆమెకు అంతగా పేరును తీసుకు రాలేకపోయాయి. ఇటీవల విజయ్‌ దేవరకొండతో నటించిన `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌`లో తన నటనతో మైమరపించినా త‌న ఇమేజ్ మార్చేంత పెద్ద రోల్ కాదు అది. అందుకే రాశీ ఇంకా మంచి పాత్రలతో త‌న‌ని తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఇక‌ తరచూ ఫొటో షూట్ లతో తనలోని కొత్త అందాలను ఆవిష్కరిస్తున్న రాశీఖన్నా తాజా షూట్ ప్ర‌స్తుతం అభిమానుల్లోకి దూసుకెళుతోంది. రాశీ నాజూకు న‌డుము ఎలివేష‌న్ కి సంబంధించిన‌ ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. వైట్‌ ఆఫ్‌ టీ షర్ట్- బ్లాక్‌ టైట్‌ లెగ్గిన్‌ ధరించింది. అంతేకాదు రెండు చేతులు పైకెత్తి తన నడుమందాన్ని ఆరాంగా చూపించేస్తుంది. అందాన్ని ఆరాధించే కుర్రాళ్లు ఓ అందాల‌ హీరోయిన్‌ తన అందాలను చూపిస్తే ఊరుకుంటారా? రెచ్చిపోకుండా ఉంటారా?

రాశీ న‌డుము సొగ‌సును వ‌ర్ణించే ప‌నిలో ప‌డ్డారంతా. ఏ హీరోయిన్‌ అయినా తన గ్లామర్‌ సైడ్ ఫోటో షూట్ దేనికి అంటే.. అదిరే అవకాశాల కోసమే.... రాశీఖన్నాకి ఇటీవ‌ల అవ‌కాశాలు త‌గ్గాయ్‌. ఇప్ప‌టికిప్పుడు కేవ‌లం రెండు సినిమాలే చేతిలో ఉన్నాయి. తమిళం లో సైతాన్‌ కా బచ్చా- అరన్మనై 3 చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఇంకా ఏ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ కాలేదు. మరి తెలుగు దర్శకనిర్మాతలు రాశీ అందాలకు ఫిదా అయి ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.