Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సెక్సీ కలలు

By:  Tupaki Desk   |   11 Sept 2017 3:31 PM IST
ఫోటో స్టోరి: సెక్సీ కలలు
X
రాయ్ లక్ష్మికి తమిళ్.. తెలుగు సినిమాల్లో బోలెడంత క్రేజ్ ఉంది. ఐటెం సాంగ్స్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బోలెడంత గుర్తింపు కూడా సంపాదించేసింది. ఏకంగా మెగాస్టార్ పక్కన డ్యాన్స్ చేసేసి తన డ్రీమ్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ భామ.. ఇప్పుడు నార్త్ లోనూ పాగా వేసేందుకు రెడీ అయిపోతోంది. జూలీ2 చిత్రంతో ఉత్తరాదిలో సెటిల్ అయిపోవాలన్నది ఈ భామ కోరిక.

అందుకే ఆ చిత్ర ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడిపోతోంది. అనుకున్నదాని కంటే ఈ సినిమా ఆలస్యం అయినా.. ఎట్టకేలకు అక్టోబర్ 6న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న జూలీ2 కోసం.. సెక్సీ ప్రచారంతో తెగ సందడి చేస్తోంది రాయ్ లక్ష్మీ. ట్రైలర్ లో సెగలు పుట్టించేయడమే కాదు.. తను పర్సనల్ గా దిగిన ఫోటోలను కూడా సినిమా ప్రచారానికి వాడేస్తుండడం విశేషం. రీసెంట్ గా ఈ సుందరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. చిన్ని సైజులో స్విమ్ వేర్ లో తను ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాయ్ లక్ష్మి.. "ఆమె కలలు జీవితం కంటే ఎక్కువగా ఉంటాయి. తను అలా కూడా బతకగలదు" అంటూ కామెంట్ చేసింది.

సెక్సీ లుక్ తో కంప్లీట్ క్లీవేజ్ ను ఆరబోసేసిన రాయ్ లక్ష్మీ.. అక్టోబర్6న జూలీ2 రిలీజ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. ఈ సినిమాపై ఈ దక్షిణాది భామ ఎంతగా ఆశలు పెట్టుకుందో.. వరుసగా జూలీ2 కోసం ఆమె పడుతున్న తపన చూస్తే అర్ధం అవుతుంది.