Begin typing your search above and press return to search.

అప్పట్లో మెరిసిన హీరోయిన్ కథే

By:  Tupaki Desk   |   20 Nov 2017 4:24 AM GMT
అప్పట్లో మెరిసిన హీరోయిన్ కథే
X
తెలుగు - తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేసినా రాయ్ లక్ష్మి కోరుకున్న స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదు. కాకుంటే ఐటం సాంగులు మాత్రం అదరగొట్టేస్తుందని పేరు తెచ్చుకుందీ అందాల భామ. కెరీర్ మూడు మాటలు.. ఆరు డ్యాన్సుల్లా సాగిపోతున్న టైంలో అనుకోని విధంగా బాలీవుడ్ నుంచి ఆమెకు అవకాశం వచ్చింది. ఎరోటిక్ సినిమా జూలీ-2లో అవకాశం రావడంతో తన టాలెంట్ ఏమిటో చూపించే పనిలో పడింది. ఇందులో లక్ష్మీరాయ్ ముందెన్నడూ కనిపించనంత హాట్ ఫోజులతో.. మత్తెక్కించే చూపులతో.. మతిపోగొట్టే డ్రస్సులతో కనిపిస్తోంది.

రాయ్ లక్ష్మి అందాల ప్రదర్శనకు తోడు జూలీ-2 సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో విషయం ఇంట్రస్టింగ్ గా మారింది. జూలీ-2 ఓ ఫేమస్ హీరోయిన్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిందని సినిమా యూనిట్ అంటోంది. ఇదేమాట హీరోయిన్ రాయ్ లక్ష్మిని అడిగితే ‘‘సినిమాలో నా క్యారెక్టర్ కు ఒకప్పటి హీరోయిన్ జీవితంతో దగ్గర పోలికలున్నాయనే మాట కొట్టిపారేయలేను. అలాగని స్టోరీ మొత్తం ఆమె జీవిత గాథలా అనిపిస్తే మాత్రం అది కాకతాళీయం మాత్రమే’’ అంటూ ఓ చిన్న మెలిక పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా నిర్మాత మాత్రం పంకజ్ నిహ్లాని మాత్రం ఇది కచ్చితంగా 2000 టైంలో తన గ్లామర్ తో ఊపేసిన హీరోయిన్ కథే అంటున్నారు. అయితే లీగల్ గా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఆమె పేరు చెప్పకలేకపోతున్నాం అంటున్నాడు.

జూలీ-2 సినిమా స్టిల్స్ చూస్తుంటే రాయ్ లక్ష్మి గ్లామర్ కు ఏ కోశానా హద్దులు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. మరి ఈ రేంజిలో అప్పట్లోనే అందాలు ఆరబోయడం అంటే సామాన్యమేమీ కాదు. దక్షిణాది వెండితెరను తన గ్లామర్ తో వేడెక్కించిన ఆ సుందరి ఎవరో చెప్పడం లేదు.. పంకజ్ నిహ్లాని మాత్రం సినిమా చూస్తే మీకే ఆ విషయం తెలిసిపోతుందంటున్నాడు.