Begin typing your search above and press return to search.

వీడియో టాక్: అందాల ప్రదర్శనే!!

By:  Tupaki Desk   |   19 Sep 2017 6:47 AM GMT
వీడియో టాక్: అందాల ప్రదర్శనే!!
X
జూలీ2 అంటూ సౌత్ బ్యూటీ రాయ్ లక్ష్మి నార్త్ లో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పటి తరం సౌత్ హీరోయిన్స్ లో ఇప్పటివరకూ ఎవరికీ దక్కని ఓ మాంచి అవకాశం ఈ భామకు దక్కింది. చాలామంది సౌత్ నటీమణులు బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు వెళ్లారు కానీ.. ఫిమేల్ సెంట్రిక్ మూవీలో.. టైటిల్ రోల్ లో.. అందులోనూ అల్ట్రా మోడర్న్ గ్లామర్ ప్రదర్శించే అవకాశం ఎవరికీ చిక్కలేదు.

తనకు దక్కిన అవకాశం ఎలాంటిదో రాయ్ లక్ష్మికి బాగానే తెలుసు. అందుకే ఈ ఛాన్స్ ను పక్కాగానే ఉపయోగించుకుందని.. రీసెంట్ గా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇప్పుడీ సినిమాలోని టైటిల్ సాంగ్ కు ప్రోమోను రిలీజ్ చేశారు. జూలీ అంటూ సాగే ఈ టైటిల్ ట్రాక్.. ఆరంభం నుంచి ముగింపు వరకూ ఒకటే కాన్సెప్ట్ తో సాగుతుంది. అమ్మడి అందాల ప్రదర్శన మాత్రమే మెయిన్ థీమ్. బ్యాక్ గ్రౌండ్ ఏమున్నా.. లొకేషన్ ఏదైనా.. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా.. అన్నిటిలోనూ రాయ్ లక్ష్మీ అందాలను మరింత అందంగా ఫోకస్ చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.

లిరికల్ గాను.. మ్యూజిక్ పరంగా కూడా జూలీ టైటిల్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత బాలీవుడ్ లో అమ్మడికి అవకాశాల వరద పారినా ఆశ్చర్యమేమీ లేదు. అక్టోబర్ 6న జూలీ2 థియేటర్లలోకి వస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అన్నీ తానై వ్యవహరిస్తోంది రాయ్ లక్ష్మీ.