Begin typing your search above and press return to search.

ఖైదీ ఐటెం సాంగు లుక్కు కాదా?

By:  Tupaki Desk   |   11 Nov 2016 1:30 AM GMT
ఖైదీ ఐటెం సాంగు లుక్కు కాదా?
X
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 గురించి ఏ చిన్న అప్డేట్ అయినా హాట్ హాట్ అప్డేట్ అయిపోతోంది. చిరు కమ్ బ్యాక్ మూవీపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి ఉండడంతో.. ఏదైనా వార్త వస్తే చాలు.. నిజమో కాదో కూడా తెలుసుకోకుండానే ఆన్యూస్ సర్క్యులేట్ అయిపోతోంది. చిరుతో కలిసి ఐటెం సాంగ్ లో చిందేయనున్న లక్ష్మీరాయ్ విషయంలో ఇదే జరిగింది.

ఐటెం సాంగ్ లో లక్ష్మీ రాయ్ లుక్ అంటూ ఓ క్లీవేజ్ షోతో కూడిన గెటప్.. బాగా హల్ చల్ చేసేసింది. పేరు మోసిన పత్రికల నుంచి ప్రతీ ఒక్కరు చిరు ఐటెం బ్యూటీ లుక్ అంటూ పబ్లిష్ చేసి పారేశారు. నిజానికి ఖైదీ నెంబర్ 150 విషయంలో మెగాస్టార్ అండ్ టీం చాలా గట్టి జాగ్రత్తలు తీసుకుంటోంది. వాళ్లు బయటకు ఇచ్చిన ఫోటోలు మినహాయిస్తే.. ఏ ఒక్క విషయం కూడా బయటకు రావడం లేదు. అందుకే చేతికి దొరికినదాన్ని పట్టుకుని ఖైదీకి అంటగటేస్తోంది మీడియా.

ఇప్పుడు లక్ష్మీరాయ్ ఐటెమ్ గెటప్ సంగతి కూడా ఇలాంటిదే. ఈ లుక్ ను చిరు కూతురు సుశ్మిత చేసిన డిజైన్ అనడం కూడా వట్టిదే. ఎందుకంటే.. అసలు లక్ష్మీ రాయ్ ఈ గెటప్ వేసినది చిరు సినిమా కోసం కాదు. ఆ మాటకొస్తే.. అసలు ఇప్పుడు కూడా కాదు. ఎప్పుడో ఐదేళ్ల క్రితం 2011లో సూర్య మూవీ సెవెంత్ సెన్స్ రిలీజ్ అయినప్పుడు.. ఈ గెటప్ వేసింది లక్ష్మీ రాయ్.

అప్పటి లుక్ ని ఇప్పుడు పోస్ట్ చేసి.. ఇదే ఖైదీ నెంబర్ 150లో లక్ష్మీరాయ్ లుక్ అనగానే.. అంతా అదే హంగామా స్టార్ట్ చేసేశారు. అసలు ఖైదీలో ఈ ఐటెం భామ లుక్ చూస్తే ప్రతీ ఒక్కరూ షాక్ తినేస్తారని తెలుస్తోంది. అయితే.. ఈ విషయం తెలిసినా సరే.. చెర్రీ అండ్ వినాయక్ టీమ్ మాత్రం వ్యూహాత్మకంగానే సైలెంట్ గా ఉందిట. ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వాలంటే ఈ మాత్రం గుట్టు దాచాల్సిందే అని ఫీలవుతున్నారట ఖైదీ యూనిట్.