Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అందాలను కవర్ చెయ్యడం లేదు!

By:  Tupaki Desk   |   30 Jan 2019 1:30 AM GMT
ఫోటో స్టొరీ: అందాలను కవర్ చెయ్యడం లేదు!
X
అందంగా ఉండడం వేరు.. హాటుగా ఉండడం వేరు. అందంగా ఉండేవారందరు హాటుగా ఉండలేరు. హాటుగా కనిపించాలంటే ఒక x-ఫ్యాక్టర్ ఉండాలి. ఆ x-ఫ్యాక్టర్ ఏంటని చెప్పమంటే మాటల్లో చెప్పలేంగానీ టాలీవుడ్ రత్తాలు రాయి లక్ష్మిని మాత్రం ఆ ఫ్యాక్టర్ ఉన్న బ్యూటీలకు ఒక ఉదాహరణగా చూపించవచ్చు. హాట్నెస్ కు కేరాఫ్ ఆడ్రెస్ రాయ్ లక్ష్మి.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు రాయ్ లక్ష్మి ఇచ్చిన క్యాప్షన్ "నన్ను నేను నమ్ముకోవడం నేనిప్పటి వరకూ చేసిన పనులలో ది బెస్ట్ పని".. నిజమే ఆత్మవిశ్వాసం కంటే గొప్పలక్షణం ఎవరికైనా మరొకటి ఏముంటుంది? క్యాప్షన్ సూపరే గానీ మనం ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవలసింది క్యాప్షన్ గురించి కాదు కదా? ఫోటో గురోంచి కదా.. మరి ఫోటో ఎలా ఉంది? యాజ్ యూజువల్ గా అదిరిపోయింది. స్విమ్ వేర్ లో తన అందాలను ఆరబోస్తూ.. నెటిజనులకోసం హాటు విందు చేస్తూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఆకాశంలోకి చూస్తూ ఒక సెక్సీ స్మైల్ ఇచ్చింది. టీ షర్టు ను అందాలను కవర్ చెయ్యడానికి వాడకుండా స్టైల్ కోసం వయ్యారంగా ఉన్న నడుముకు చుట్టుకుంది.

ప్రస్తుతం రాయ్ లక్ష్మి తమిళంలో 'మలర్' అనే సినిమాలోనూ..తెలుగులో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాలోనూ నటిస్తోంది. 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాలో కమెడియన్లు ప్రవీణ్ మధునందన్ లు లీడ్ రోల్స్ లో నటిస్తుండడం విశేషం. మరి ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను మెప్పిస్తుందేమో వేచి చూడాలి.